మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు జరగడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అధ్యక్ష పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఇచ్చిన హామీలను గెలిచిన తరువాత కచ్చితంగా నెరవేరుస్తారని సినీ ప్రముఖులు, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ సభ్యులు భావించడం లేదు. ప్రధానంగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కు సొంత భవనం లేదనే విమర్శ వినిపిస్తుండగా కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే హీరోలు ఉన్నా ‘మా’కు భవనం లేకపోవడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి.
సినీ ప్రముఖులు తెలంగాణ ప్రభుత్వాన్ని ‘మా’ కోసం స్థలాన్ని మంజూరు చేయాలని కోరుతున్నా ప్రభుత్వ పెద్దలు పట్టించుకోవడం లేదు. మెగాస్టార్ చిరంజీవి ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని భావిస్తున్నట్టు ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ‘మా’ ఎన్నికల తరువాత చిరంజీవి సినీ ప్రముఖులతో కలిసి కేసీఆర్ ను కలవబోతున్నారని తెలుస్తోంది. ప్రభుత్వం స్థలం కేటాయించడానికి సిద్ధంగా లేకపోతే చిరంజీవి మిగతా నటీనటులతో చర్చించి ‘మా’ భవనం విషయంలో ముందడుగులు వేయనున్నారు.
‘మా’ భవన నిర్మాణం విషయంలో వ్యక్తమవుతున్న విమర్శలకు చెక్ పెట్టే దిశగా చిరంజీవి అడుగులు వేస్తుండటం గమనార్హం. ఒకవైపు సినిమాలతో బిజీగా ఉన్న చిరంజీవి మరోవైపు కష్టాల్లో ఉన్న సినీ కార్మికులకు తన వంతు సహాయం చేస్తున్నారు. చిరంజీవి చేసే మంచి పనులపై కొందరు విమర్శలు చేస్తున్నా చిరంజీవి మాత్రం ఇతరులకు మేలు చేసే నిర్ణయాల విషయంలో వెనుకడుగు వేయకపోవడం గమనార్హం. చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమాలో నటిస్తుండగా త్వరలో ఆ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్ కానుంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసిఫర్ రీమేక్ లో నటించనున్నారు.
Most Recommended Video
విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!