Chiranjeevi, Koratala Siva: మరోసారి ఆచార్య ప్రస్తావన తీసుకొస్తూ అలాంటి కామెంట్స్ చేసిన చిరు!

చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు.ఈయన గత ఏడాది కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఆచార్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా పైఅభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. అయితే ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటించడంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. ఇక ఈ సినిమా విడుదల అయి డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులు తీవ్ర నిరాశ వ్యక్తం చేశారు.

ఈ సినిమా తర్వాత చిరు గాడ్ ఫాదర్ సినిమా ద్వారా ప్రేక్షకులను సందడి చేశారు.ఈ సినిమా పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.ఆచార్య సినిమా డిజాస్టర్ కావడంతో పలుమార్లు చిరంజీవి ఈ సినిమా గురించి ప్రస్తావిస్తూ తప్పు మొత్తం కొరటాలదే అన్నట్టు మాట్లాడారు. ఇకపోతే తాజాగా మరోసారి వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా చిరంజీవి మరొకసారి ఆచార్య సినిమా గురించి ప్రస్తావనకు తీసుకువచ్చారు.

ఇక సినిమాల గురించి మాట్లాడుతూ.. సినిమాకు డైరెక్టర్ ఎంతో కీలకమైన వారు. ఆయన ఒక సినిమా ఎంత నిడివి అవసరం ఆ సినిమాకు కథ ఎంత ముఖ్యం అనేది ముందుగా సిద్ధం చేసి పెట్టుకుంటారు. అయితే మన సినిమాకు అవసరమైన కథను మాత్రమే మనం చిత్రీకరించినప్పుడు ఎంతో సమయం ఆదా అవుతుందని అలాగే మనం అనుకున్న బడ్జెట్ లోనేసినిమా కూడా పూర్తి అవుతుందని అప్పుడు హీరోలకు డేట్స్ ప్రాబ్లం కూడా ఉండదని చిరంజీవి తెలిపారు.

అలా కాకుండా మూడు నాలుగు గంటలకు సరిపడా సినిమాని చేసి ఆ సినిమాను కేవలం రెండున్నర గంటలకు సరిపడ కథను ఉంచి మిగతాది మొత్తం కట్ చేయడం వల్ల నిర్మాతలు భారీగా నష్టపోతారని తెలిపారు.ఆచార్య విషయంలో ఇదే జరిగింది కనుక ఈయన ఈ వ్యాఖ్యలు చేస్తూ నేను ఈ విషయాన్ని కొరటాల శివను ఉద్దేశించి చెప్పలేదని, ప్రతి ఒక్క డైరెక్టర్ ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఎంతోసమయం మిగలడమే కాకుండా నిర్మాతలకు ఖర్చు కూడా తగ్గుతుందని చిరంజీవి ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus