అలసిన మెగాస్టార్ ఏ పని చేసాడు ?

మెగాస్టార్ చిరంజీవి తన 150 వ చిత్రం ఖైదీ నెం.150 చిత్రీకరణలో బిజీగా ఉన్నారు. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ ఈ చిత్రాన్ని అభిమానుల అంచనాలకు మించి తెరకెక్కిస్తున్నారు. చిరు తొమ్మిదేళ్ల తర్వాత చేస్తున్న సినిమా కావడంతో నిర్మాత రామ్ చరణ్ తేజ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. బ్లాక్ బస్టర్ తో రీ ఎంట్రీ ఇవ్వాలని మెగాస్టార్ శ్రమిస్తున్నారు. అయన పుట్టిన రోజున విడుదలైన చిత్ర మోషన్ పోస్టర్ అభిమానులకు, చిత్ర పరిశ్రమ పెద్దలకు బాగా నచ్చింది.

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సైతం లుక్ అదిరిపోయిందని అభినందించాడు. ఫస్ట్ లుక్ తో క్రేజ్ పెంచుకున్న ఈ మూవీ ఇంట్రవెల్ ఫైట్ జరుపుకుంటోంది. నగరంలోని నానక్ రామ్ గూడా పరిసరాల్లో భారీ యాక్షన్ సీక్వెన్స్ రామ్ లక్ష్మణ్ ఆధ్వర్యంలో చిత్రీకరిస్తున్నారు. ఈ షూటింగ్ లో అలసిపోయిన మెగాస్టార్ కొంత సేపు సేద తీరారు. దగ్గర్లోని చెరువులో చేపలు పడుతూ విశ్రాంతి పొందారు. దీని తర్వాత షూటింగ్ లో జాయిన్ అవుతారని ప్రొడక్షన్ హౌస్ వెల్లడించింది. ఇంతకీ మెగా స్టార్ గేలానికి ఎన్ని చేపలు చిక్కాయో? మరి.

Exclusive : Chiranjeevi Fishing at Khaidi No150 Movie Location || Filmyfocus. com

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus