కొత్త ‘టెన్షన్’లో మెగా కాంపౌండ్!!!

మెగా స్టార్ సెకెండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన టైమ్ నుంచి ఏదో ఒక టెన్షన్ తో సతమతం అవుతుంది మెగా శిబిరం…..ఇంతకీ విషయం ఏమిటంటే….టాలీవుడ్ లో దాదాపుగా ఎన్నో ఏళ్ల తరువాత నందమూరి మరియు మెగా హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో నిలిచాయి….అయితే ఒక పక్క రెండూ ప్రతిష్టాత్మక సినిమాలు కావడం, రెండింటి పైనా ఆయా హీరోల అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకోవడం చూస్తుంటే ఈ సంక్రాంతి ఎంతటి టెన్షన్ లో గడుస్తుందో అన్న భయం నెలకొంది…ఇదిలా ఉంటే ఎలా అయినా ఒకరి పై మరొకరు పై చెయ్యి సాధించాలీ అన్న ఆలోచనతో ఉన్న క్రమంలో…కలక్షన్స్ రికార్డులకు సంబంధించి ఈ రెండు సినిమాలకు వచ్చిన నెట్ కలక్షన్స్ రికార్డులలో ‘ఖైదీ నెంబర్ 150’ కంటే నెట్ కలక్షన్స్ రికార్డుల విషయంలో బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ విడుదలైన మొదటి రోజు నుండే ఈ సంక్రాంతి రేసులో తన ఆధిపత్యాన్ని నిలుపుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అన్న వాదన బలంగా వినిపిస్తుంది.

దానికి కారణం….ఏంటి అంటే….టాలీవుడ్ సర్కిల్స్ నుంచి వినిపిస్తున్న వివరాల ప్రకారం…బాలకృష్ణ ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ సినిమాకు విడుదలకు కొద్దిరోజులు ముందుగానో లేదంటే ఈ సినిమా విడుదలైన వెంటనే ఈసినిమాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినోదపు పన్ను మినహాయింపు ఇచ్చే ఆస్కారం ఉంది అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి….అదే క్రమంలో ఇదే తరహా అభ్యర్ధనను తెలంగాణ ముఖ్యమంత్రికి కూడ ఇవ్వాలనే ఆలోచనలలో క్రిష్ ఉన్నట్లు తెలుస్తోంది.  హీరో బాలకృష్ణకు కెసిఆర్ కు ఉన్న సాన్నిహిత్యం రీత్యా తెలంగాణ రాష్ట్రంలో కూడ తమ ఆలోచన విజవంతం అవుతుందని క్రిష్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. మరి అదే నిజం అయితే మాత్రం….ఒక రకంగా బాలయ్య చిరు పై పై చెయ్యి సాధించినట్లే అన్న విషయం ఇట్టే అర్ధం అయిపోతుంది…మరి ఏం జరగబోతుందో చూద్దాం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus