ఇప్పటివరకు దర్శకుడిగా తెరవెనుక కనిపించిన రాఘవేంద్రరావు తొలిసారి నటుడిగా మారి సినిమా చేస్తున్నారు. గౌరీ రోనంకి దర్శకత్వంలో శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా నటిస్తోన్న ‘పెళ్లి సందD’ సినిమాలో రాఘవేంద్రరావు.. వశిష్ట అనే పాత్ర పోషిస్తున్నారు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఇందులో రాఘవేంద్రరావు స్టైలిష్ లుక్ తో ఆకట్టుకున్నారు. దాదాపు వంద సినిమాలను డైరెక్ట్ చేసిన రాఘవేంద్రరావు ఇప్పుడు నటుడిగా మారడంతో సెలబ్రిటీలంతా ఆయనకు విషెస్ చెబుతున్నారు.
అయితే మెగాస్టార్ చిరంజీవి మాత్రం ఇప్పుడు రాఘవేంద్రరావుతో సినిమా చేయాలనుకుంటున్నారట. ఈ విషయాన్ని ఆయనే వాయంగా వెల్లడించింది. రీసెంట్ గా కొందరు మీడియా సభ్యులతో మాట్లాడిన చిరు.. రాఘవేంద్రరావుతో జరిపిన సంభాషణ గురించి వెల్లడించింది. వశిష్టగా ఆయన గెటప్ చూసిన తరువాత రాఘవేంద్రరావుని హీరోగా పెట్టి తను డైరెక్ట్ చేయాలనుకున్నారట మెగాస్టార్. ఈ విషయాన్ని రాఘవేంద్రరావుకు చెప్పగా.. ఇప్పుడే నాకు టెన్షన్ మొదలైందంటూ చెప్పారట.
గతంలో చిరంజీవి హీరోగా రాఘవేంద్రరావు సినిమాలు తీశారు. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. అలాంటిది ఇప్పుడు రాఘవేంద్రరావుని చిరు డైరెక్ట్ చేస్తారని చెప్పడం విశేషం. నిజంగా ఈ ఇద్దరు లెజండ్స్ కలిపి సినిమా చేస్తారేమో చూద్దాం!