న‌వంబ‌ర్ 26న మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా నిఖిల్ `అర్జున్ సుర‌వ‌రం` ప్రీ రిలీజ్ వేడుక‌

యువ క‌థానాయ‌కుడు నిఖిల్, లావ‌ణ్య త్రిపాఠి జంట‌గా న‌టిస్తోన్న చిత్రం `అర్జున్ సుర‌వ‌రం`. న‌వంబ‌ర్ 29న ఈ చిత్రం గ్రాండ్ రిలీజ్ కానుంది. న‌వంబ‌ర్ 26న ఈసినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను పీపుల్స్ ప్లాజాలో నిర్వ‌హించ‌బోతున్నారు. ఈ సంద‌ర్భంగా నిఖిల్ మాట్లాడుతూ “ఓ క్రేజీ విష‌యం జ‌రిగింది. మెగాస్టార్ చిరంజీవిగారిని ఇప్పుడే క‌లుసుకున్నాం. ఆ అనుభూతి చాలా గొప్ప‌గా అనిపించింది. మా `అర్జున్ సుర‌వ‌రం` సినిమాను చూసి ఆయ‌న మ‌మ్మ‌ల్ని ఆయ‌న ఇంటికి పిలిచి మాట్లాడారు. ఆయ‌న‌కు సినిమా బాగా న‌చ్చింది. మా సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆయ‌న ముఖ్య అతిథిగా వ‌స్తాన‌ని అన్నారు. మా యూనిట్ అంద‌రికీ ఇది చాలా పెద్ద విష‌యం. చాలా ఎగ్జ‌యిటింగ్‌గా ఉంది. పీపుల్స్ ప్లాజాలో ఈ నెల 26న గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వ‌హిస్తున్నాం“ అన్నారు.

న‌కిలీ స‌ర్టిఫికేట్స్ కుంభ‌కోణంలో అర్జున్ సుర‌వ‌రం అనే ఇన్వెస్టిగేటివ్ జ‌ర్న‌లిస్ట్ అరెస్ట్ అవుతాడు. ఆ కేసును ఆ జ‌ర్న‌లిస్ట్ ఎలా చేధించాడ‌నేదే ఈ సినిమా క‌థ‌. ప్ర‌ముఖ నిర్మాత ఠాగూర్ మ‌ధు స‌మ‌ర్ప‌ణ‌లో మూవీ డైన‌మిక్స్ ఎల్ ఎల్ పి బ్యాన‌ర్‌పై రాజ్‌కుమార్ ఆకెళ్ల నిర్మాత‌గా టి.సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ ఇది. పోసాని కృష్ణ‌ముర‌ళి, సత్య‌, త‌రుణ్ అరోరా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించిన ఈ చిత్రానికి సూర్య సినిమాటోగ్ర‌ఫీ అందించారు. ఈ సినిమా పోస్ట‌ర్స్‌కు, టీజ‌ర్‌కు చాలా మంచి రెస్పాన్స్ వ‌చ్చింది.

“జార్జ్ రెడ్డి” సినిమా రివ్యూ & రేటింగ్!
యాక్షన్ సినిమా రివ్యూ & రేటింగ్!
తెనాలి రామకృష్ణ బిఏ బిఎల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్! 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus