మెగా స్టార్ సరసన మిల్కీ బ్యూటీ..?
- May 2, 2016 / 11:39 AM ISTByFilmy Focus
ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న మెగాస్టార్ చిరంజీవి 150 వ చిత్రం ఎట్టకేలకు ప్రారంభమైంది. వివి వినాయక్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. ఈ చిత్రంలో చిరు సరసన జంటగా ఎవరు నటిస్తారన్నది తెలియాల్సి ఉంది. అనుష్క, నయనతార పేర్లు ప్రముఖంగా వినిపించినప్పటికీ.. చిరు చిత్రంలో నటించడం లేదని నయన్ ఇటీవలే స్పష్టత ఇచ్చింది. మరోవైపు బాహుబలి చిత్రంలో అనుష్క బిజీగా ఉండటంతో..
చిరు సరసన మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుందని ఫిల్మ్ నగర్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే మెగా హీరోలందరితోనూ తమన్నా నటించగా.. 150వ చిత్రంలో ఆమె ఎంపికకు చిరు అభ్యంతరం వ్యక్తం చేయవచ్చని కొందరు అంటుంటే.. మరికొందరు మాత్రం తమన్నాతో ఏదో ఒకరోజు కలిసి నటిస్తానని రచ్చ ఆడియో విడుదల కార్యక్రమంలో చిరు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. ఏదేమైనా చిరు సరసన ఎవరు నటించనున్నారన్న విషయాన్ని దర్శక నిర్మాతలు త్వరలోనే వెల్లడించే అవకాశం
ఉంది.

















