వెన్నెల కిషోర్ తో మెగాస్టార్ కామెడీ ట్రాక్!

మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆచార్య’. ఈ సినిమాలో రామ్ చరణ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సీరియస్ ఎమోషన్స్ తో సాగే కథ ఇది. అలా అని దీన్ని పూర్తి సీరియస్ డ్రామాగా కాకుండా కామెడీ కూడా ఉండేలా చూసుకుంటున్నాడు దర్శకుడు కొరటాల. మెగాస్టార్ చిరంజీవి మాస్ హీరో మాత్రమే కాదు. ఆయన కామెడీ టైమింగ్ కూడా ఎంతో క్లాసీగా ఉంటుంది. చిరు సూపర్ హిట్ సినిమాల్లో కామెడీ ట్రాక్ లు చాలానే ఉన్నాయి. ఇప్పటికీ ఆయన కామెడీ టైమింగ్ ని ఎవరూ మ్యాచ్ చేయలేరని చెప్పుకుంటారు.

తాజాగా ‘ఆచార్య’ సినిమాలో కూడా చిరు కొన్ని కామెడీ సీన్లలో బాగా నవ్వించాడని సమాచారం. చిరంజీవి-వెన్నెల కిషోర్ మధ్య నడిచే కామెడీ ట్రాక్ ‘ఆచార్య’ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని చెబుతున్నారు. చిరు మార్క్ కామెడీని ఈ సినిమాలో ప్రేక్షకులు చూడబోతున్నారని సమాచారం. సినిమాలో చిరు గ్యాంగ్ లో బెనర్జీ, వెన్నెల కిషోర్, తనికెళ్ల భరణి ఉంటారని.. వాళ్ళతో చిరు చేసే కామెడీ సీన్లు బాగా వచ్చాయని టాక్. ఈ కామెడీ ట్రాక్ పై కొరటాల స్పెషల్ ఫోకస్ పెట్టాడు.

తను స్వయంగా రచయిత అయినప్పటికీ.. ఈ సన్నివేశాలని మరో రచయిత శ్రీధర్ సీపానతో రాయించినట్లు తెలుస్తోంది. సినిమాలో కామెడీ ట్రాక్స్ అన్నీ కూడా శ్రీధర్ సీపానే రాసినట్లు తెలుస్తోంది. సాధారణంగా వెన్నెల కిషోర్ కామెడీ అంటే ఎలా ఉంటుందో తెలిసిందే. తొలిసారి ఈ కమెడియన్ కి మెగాస్టార్ తో కలిసి కామెడీ ఛాన్స్ వచ్చింది. మరి వీరిద్దరూ కలిసి వెండితెరపై ఎలాంటి రచ్చ చేస్తారో చూడాలి. ఈ సినిమాను వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

Most Recommended Video

శ్రీకారం సినిమా రివ్యూ & రేటింగ్!
జాతి రత్నాలు సినిమా రివ్యూ & రేటింగ్!
గాలి సంపత్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus