చిరు ఖైదీ గా మారడం వెనుక శ్రమ

  • January 11, 2017 / 12:37 PM IST

దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ నంబర్ కిరీటాన్ని సొంతం చేసుకున్న వ్యక్తి… తన నటన, డ్యాన్సులతో కోట్లాది ప్రజలను ఆకట్టుకున్న కథానాయకుడు… స్వయం కృషితో మెగాస్టార్ గా ఎదిగిన హీరో చిరంజీవి. అతను మళ్లీ తన సినీ రాజ్యంలోకి అడుగు పెడుతుంటే ఎలా ఆలోచించారు?. తన స్థానం పదిలం అని నిరూపించుకోవడానికి ఎటువంటి కసరత్తులు చేశారు?, ఖైదీ నంబర్ 150 కోసం చిరంజీవి పడిన మానసిక, శారీరక శ్రమ గురించి ఆయన మాటల్లోనే..

పశ్చాత్తాప పడలేదునాన్ స్టాప్ గా 30 ఏళ్లు నటించాను. ఓ రకమైన అలసటకు గురయ్యాను. ఆ అలసట నుంచి మానసిక సంతృప్తి కోసం వేరే రంగానికి వెళ్లాను. అక్కడ ఓ స్థాయి చేరుకున్నాను. సినీ రంగాన్ని వదులుకున్నాను అని ఎప్పుడు పశ్చాత్తాప పడలేదు. మళ్లీ సినీ రంగంవైపు రావాలనుకోగానే ప్రతి ఒక్కరూ నన్ను స్వాగతించారు. అభిమానులే కాదు. అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ లాంటి వారూ నేను సినిమాల్లోకి రావాలన్నారు. అంతటి గొప్ప స్వాగతం నాకు లభించింది.

ఏడాది కృషిసినిమా చేయాలని నిర్ణయించుకున్నప్పుడే నా ఆహారపు అలవాట్లు మార్చుకున్నా. ప్రతిరోజూ వ్యాయమం చేయడం మొదలుపెట్టా. కఠినమైన శిక్షణ తీసుకున్నా. ప్రత్యేకంగా ఓ జిమ్ కోచ్, డైటీషియన్ని పెట్టుకున్నా. వాళ్ల సలహాలు తీసుకున్నా. రిజల్ట్ కూడా అలాగే వచ్చింది. స్లిమ్ కావడం వెనక రెండు మూడు నెలల కష్టం కాదు.. ఓ ఏడాది పాటు శ్రమ ఉంది.

కత్తి చేయడమే కరక్ట్ఏ ఆర్టిస్ట్ కి అయినా ఇమేజ్ ప్లస్సే. అదొక అదృష్టం. ఒక్కో ఆర్టిస్ట్ కి ఒక్కో ఇమేజ్ వస్తుంది. ఆ ఇమేజ్ కి నిర్వచనం ఇవ్వలేం. ఇమేజ్ రావడం, అది రాను రాను బలం కావడం అనేది లక్. కాకపోతే తన బలం ఎక్కడుందో ఆర్టిస్ట్ కి తెలియాలి. అది తెలుసుకుని దానికి తగ్గట్టుగా కథలు ఎన్నుకోవాలి. నాకున్న ఇమేజ్ కి నేను ‘కత్తి’ చేయడమే కరెక్ట్. అందుకే రీమేక్ కి రెడీ అయ్యా.

ఫస్ట్ డే ఫీలింగ్ఇష్టమైన ఫీల్డ్లో మనకి ఇష్టమైన పని చేస్తుంటే ఉండే జోష్ మాటల్లో చెప్పలేము. 2007లో ‘శంకర్ దాదా జిందాబాద్’ చేసిన ఆఖరి క్షణానికీ, 2016లో ‘ఖైదీ నంబర్ 150’ మొదటి రోజు షూటింగ్ చేసిన క్షణానికీ నాకు తేడా లేదు. బాగా ఎంజాయ్ చేశాను. నిజంగా చెప్తున్నాను. మేకప్ వేసుకుని సెట్లోకి వెళ్లిన తర్వాత స్టార్ట్, కెమెరా, యాక్షన్ అనే ధ్వని వినపడగానే… పదేళ్ల క్రితం నన్ను నడిపించిన, నాకు ఇష్టమైన, నేను ఆస్వాదించిన వాతావరణం మళ్లి వచ్చినట్లుగా అనిపించింది.

యూత్ స్టెప్స్సాంగ్స్ విషయంలో కొంచెం కొత్తగా ప్రయత్నించాం. యంగ్ డ్యాన్స్ మాస్టర్స్ శేఖర్, జానీ, లారెన్స్లు ఇందులో పాటలకు కొరియోగ్రఫీ చేశారు. వాళ్ల మూమెంట్స్ నా బాడీపై కొత్తగా అనిపించాయి. డ్యాన్స్ మాస్టర్ కంపోజ్ చేయగానే డ్యాన్స్ చేస్తుంటే.. కాజల్ అగర్వాల్ ఆశ్చర్యపోయింది.

అరుదైన రికార్డ్చిత్ర పరిశ్రమలో తండ్రితో నటించిన తర్వాత కొడుకుతో నటించిన హీరోయిన్లున్నారు. కాజల్ మాత్రం ముందు కొడుకుతో చేసి, తర్వాత తండ్రితో నటించింది. కాజల్ ది అరుదైన రికార్డు.

కాస్ట్యూమ్ డిజైనర్నా పెద్ద కుమార్తె సుస్మిత నిఫ్ట్ లోనూ, లండన్ స్కూల్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీలోనూ శిక్షణ తీసుకుంది. మొదట్నుంచీ సినిమా వాతావరణంలో పెరగడం వలన తన శిక్షణను సినిమాకి అనుగుణంగా సుస్మిత మలచుకుంది. ‘శంకర్ దాదా ఎంబీబీఎస్’, ‘అందరివాడు’.. నా లాస్ట్ సినిమాలు అన్నిటికీ తనే చేస్తూ వచ్చింది. ఖైదీ నంబర్ 150 లోను చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ ఎఫెక్టివ్ గా చూపించడంలో తను సక్సెస్ అయింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus