టాలీవుడ్ ఇండస్ట్రీలో కరోనా దెబ్బకు మళ్ళీ ఒక్కసారిగా రిలీజ్ డేట్స్ లలో కన్ఫ్యూజన్ క్రియేట్ అయ్యింది. అంతా సెట్టయ్యిందని అనుకుంటున్న తరుణంలో క్రాక్, ఉప్పెన, జాతిరత్నాలు వంటి సినిమాలు కూడా హిట్టవ్వడంతో ఇండస్ట్రీలో అందరికి ఒక ధైర్యం వచ్చింది. మళ్ళీ హ్యాపీగా సినిమాలను రిలీజ్ చేసుకోవచ్చని అనుకున్నారు. నాన్ స్టాప్ గా రిలీజ్ డేట్స్ ను ఎనౌన్స్ చేయడంతో మళ్ళీ ఇండస్ట్రీలో పాత రోజులు గుర్తుకు వచ్చాయి. అయితే ఆ ఆనందం ఎక్కువ రోజులు ఉండలేదు.
మళ్ళీ సెకండ్ వేవ్ దెబ్బకు అన్ని సినిమాలు వాయిదా పడ్డాయి. ఇక రానున్న రోజుల్లో థియేటర్లు తెరిస్తే పెద్ద సినిమాల హీరోల చూపు మొత్తం కూడా దసరా వైపే ఉంది. లవ్ స్టొరీ, సీటిమార్, విరాటపర్వం, టక్ జగదీష్ వంటి సినిమాలు ఫెస్టివల్ కంటే ముందే పరిస్థితులను బట్టి ఒకదాని తరువాత మరొకటి రావచ్చు. అయితే మెగాస్టార్ ఆచార్య, ప్రభాస్ రాధేశ్యామ్ వంటి బిగ్ బడ్జెట్ సినిమాలు వచ్చే దసరా సీజన్ ను యూజ్ చేసుకోవాలని చూస్తున్నాయి.
ఇక వారి మధ్యలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – రానా హై వోల్టేజ్ డ్రామా అయ్యప్పనుమ్ కొశీయుమ్ రీమేక్ కూడా పోటీకి రావచ్చు. ఏదేమైనా ఆ డేట్ ను మాత్రం మిస్ చేసుకోవద్దని నిర్మాతలైతే బలంగా ఉన్నారట. కానీ ఒకేసారి అంత పెద్ద సినిమాలు వస్తే డిస్ట్రిబ్యూటర్స్ పై ప్రభావం పడక తప్పదు. మరి ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో తెలియాలి అంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.