Chiranjeevi: ఎంతైనా దానం చేశాను: మెగాస్టార్ చిరంజీవి!

  • December 25, 2022 / 05:19 PM IST

మెగాస్టార్ చిరంజీవి చేసే సామాజిక కార్యక్రమాల గురించి కొత్తగా చెప్పాల్సిన పని లేదు. కొన్ని దశాబ్దాల క్రితమే బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంక్ పెట్టి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపారు. కరోనా విజృంభించిన సమయంలో ఆయన చేసిన సేవా కార్యక్రమాల గురించి ఎంత చెప్పినా తక్కువే. కోట్ల రూపాయల విరాళాలతో సహాయ కార్యక్రమాలు చేపట్టడంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆక్సిజన్ ప్లాంట్స్ ఏర్పాటు చేశారు.

ఫ్యూచర్ లో మరింతగా తన సేవా కార్యక్రమాలను విస్తరించాలని చిరు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఛారిటీ విషయమై తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇన్నాళ్లూ కుటుంబం గురించే ఆలోచించాన‌ని.. ఇక స‌మాజానికి తిరిగివ్వ‌డం మీద దృష్టిపెడ‌తాన‌ని చిరు అన్నారు. ఎంతో స్టార్ డమ్ చూసిన గొప్ప నటులు, దర్శకనిర్మాతలు చివరి దశల్లో చాలా కష్టాలు, ఆర్థిక ఇబ్బందులు చూశారని అన్నారు.

ఎంత సంపాదించినా.. చివరికి ఏమీ కూడబెట్టుకోలేకపోయారని.. అందుకే తన కుటుంబానికి ఆస్తులు కూడబెట్టాలి అన్నట్లుగా మొదట్లో ఉండేవాడినని చిరు అన్నారు. ఇప్పుడు ఆ అవసరం లేదని.. పిల్లలందరూ జీవితంలో మంచి స్థాయిలో స్థిరపడ్డారని.. ఇప్పుడు వారికోసం కూడబెట్టాల్సిన అవసరం లేదని అన్నారు. భగవంతుడు అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చాడని.. ఇప్పుడు దాన్ని సమాజానికి తిరిగి ఇవ్వాలనుకుంటున్నట్లు చెప్పారు.

కీర్తి, గ్లామర్ శాశ్వతం కాదని.. వ్యక్తిత్వమే శాశ్వతమని నమ్ముతానని చిరు అన్నారు. ఇకపై తన జీవితం ఛారిటీకే అంకితమని.. ఎంతైనా దానం చేస్తానని అన్నారు. సినిమాల ద్వారా వస్తోన్న డబ్బు కూడా ఛారిటీకే ఉపయోగిస్తున్నానని చిరు అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం ఆయన నటించిన ‘వాల్తేర్ వీరయ్య’ సినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus