నిన్న అంటే ఫిబ్రవరి 18న తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అయితే నిన్న మెగా ఫ్యామిలీలో రెండు పండుగలు జరిగాయి. ఒకటి శివరాత్రి పండుగ అయితే ఇంకోటి మెగాస్టార్ చిరంజీవి భార్య సురేఖ పుట్టినరోజు వేడుకలు. ఈ సందర్భంగా మెగా ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు మెగా అభిమానులు కూడా సోషల్ మీడియాలో సురేఖ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
శివరాత్రి రోజు పూజలు ఆచరించడంతో పాటు తన తల్లి సురేఖతో దిగిన ఫోటోను షేర్ చేశాడు రాంచరణ్. అలాగే ఉపాసన కూడా తన అత్తగారితో దిగిన ఫోటోని షేర్ చేసి బర్త్ డే విషెస్ చెప్పింది. ఇక సురేఖ గారి బర్త్ డే స్పెషల్ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :