మెగా మరియు మహేష్ అభిమానులకి కన్నుల పండగే..!

మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతోన్న ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11 న విడుదల కాబోతుంది. రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కూడా కీలక పాత్ర పోషిస్తుంది. ఇక దిల్ రాజు, అనిల్ సుంకర కలిసి నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదల చేసిన టీజర్ మరియు పాటలకు అద్బుతమైన స్పందన లభించింది.

Chiranjeevi With Mahesh babu

ఇక ఈ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జనవరి 5న నిర్వహించబోతున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ వేడుకకి గెస్ట్ గా ఎవరొస్తారు అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. మహేష్ గత చిత్రాలైన ‘భరత్ అనే నేను’ కు ఎన్టీఆర్, ‘మహర్షి’ కు వెంకటేష్, విజయ్ దేవరకొండ వంటి హీరోలు విచ్చేశారు. ఇక ఈసారి కూడా ఓ స్టార్ హీరో గెస్ట్ గా రాబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ కు ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తుంది. అంతేకాదు విక్టరీ వెంకటేష్ కూడా హాజరయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తుంది.

వెంకీ మామ సినిమా రివ్యూ & రేటింగ్!
అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus