Chiranjeevi: చిరు లాంటి గొప్ప వ్యక్తి ఆ పదం ఎందుకు వాడారు?

Ad not loaded.

మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi)  ఏ సినిమా ఈవెంట్ కి వెళ్లినా మినిమమ్ అరగంట మాట్లాడతారు. చాలా వరకు దానికంటే ఎక్కువే ఉంటుంది తప్ప తగ్గదు. సినిమా గురించి, అక్కడ ఉన్న ఫిలిం మేకర్స్ గురించి.. వాళ్ళతో బంధం ఎక్కడ నుండి మొదలైంది.. ఎక్కడి వరకు వచ్చింది.. ఎలా ఉంది? వంటి చెబుతూ ఉండేవారు చిరు. అయితే ఈ మధ్య కాలంలో చిరుపై సోషల్ మీడియా మీడియా ప్రభావం కూడా ఎక్కువ పడినట్టు కనిపిస్తుంది.

Chiranjeevi

ఎందుకంటే ఇటీవల చిరు సోషల్ మీడియాలో జరిగే చర్చల గురించి ఎక్కువగా మాట్లాడుతున్నారు. ముందుగా సోషల్ మీడియాలో చిరు పై జరిగే చర్చల గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చి.. తర్వాత స్పీచ్లోకి వెళ్తున్నారు. సరే అందులో తప్పేమీ లేదు. ఇష్యూ పై క్లారిటీ ఇవ్వడం మంచిదే. కానీ సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యే పదాలు, డబుల్ మీనింగ్ పదాలు వంటివి చిరు మాట్లాడితే.. అది ఆయన వయసుకి, స్థాయికి మంచిది కాదు. సరే విషయంలోకి వెళ్ళిపోదాం.. నిన్న ‘బ్రహ్మానందం’ (Brahma Anandam) ప్రీ రిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా వెళ్లారు చిరు.

అక్కడ బ్రహ్మానందం (Brahmanandam) గురించి చాలా గొప్పగా చెప్పారు. భీమవరం వద్ద అత్తిలిలో లెక్చరర్ గా పనిచేసే బ్రహ్మానందం తన ‘చంటబ్బాయ్’ సినిమా షూటింగ్ చూడటానికి వచ్చారని, మొదట అతనిపై కోప్పడ్డారని, ఈవెనింగ్ సిట్టింగ్లో బ్రహ్మానందం వచ్చి మిమిక్రీ చేసి అక్కడి వారిని నవ్వించాడని,దీంతో అతన్ని కాలేజీకి వెళ్ళకుండా లీవ్ పెట్టించి చెన్నైకి తీసుకొచ్చి, అప్పటి ఇండస్ట్రీ పెద్దలకి అగ్ర దర్శకులకి పరిచయం చేశానని, ఒక రకంగా బ్రహ్మానందం ఈరోజు స్టార్ అయ్యి ఇలా ఉండటానికి తానే కారణమని చిరు చెప్పారు.

అది నిజమే కావచ్చు. చాలా గొప్ప విషయం కూడా..! అయితే మధ్యలో ‘నేను ఏదో చెబితే బ్రహ్మానందం ఎరుపు మొహం వేసుకుని.. రెడ్ ఫేస్ వేసుకుని చూశాడు. నా తమ్ముళ్ల వద్ద కూడా ఎరుపు మొహం పెట్టాడు’ అంటూ చిరు తన స్థాయికి తగని కామెంట్లు చేశారు. చిరంజీవి (Chiranjeevi) టాలీవుడ్ కి ఇండస్ట్రీ పెద్ద లాంటి వ్యక్తి. చిరుని చూసి ఇన్స్పైర్ అయ్యే జనాలు ఇంకా చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు ఆయన ఇలాంటి పదాలు వంటివి వాడకుండా ఉంటే మంచిది కదా..!

వయసుకీ, పెద్దరికానికి ఇలాంటివి సరిపడవు మెగాస్టార్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus