మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో ‘ఆచార్య’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదా పడింది. సెప్టెంబర్ లో తిరిగి షూటింగ్ మొదలుపెట్టాలనే ప్లాన్ లో ‘ఆచార్య’ టీం ఉన్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఈ చిత్రాన్ని ‘మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్’ మరియు ‘కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ’ బ్యానర్ల పై నిరంజన్ రెడ్డి, రాంచరణ్ కలిసి నిర్మిస్తున్నారు. ఇప్పటికే 40శాతం షూటింగ్ పూర్తయ్యింది. ఈ చిత్రంలో రాంచరణ్ కూడా ఓ కీలక పాత్ర పోషిస్తున్నట్టు దర్శకుడు కొరటాల శివ చెప్పుకొచ్చాడు.
అయితే ‘ఆర్.ఆర్.ఆర్’ వల్ల చరణ్ ఈ పాత్ర చెయ్యడం కుదురుతుందో లేదో అని.. మహేష్ బాబుతో మొదట ఈ పాత్ర చేయించాలి అని కూడా ప్లాన్ చేశారు. నిర్మాతలు మహేష్ కు 30 కోట్ల వరకూ పారితోషికం ఆఫర్ చేశారు. అయితే కారణాలేంటో తెలీదు కానీ.. మళ్ళీ చరణ్ తోనే ఆ పాత్రను చేయించాలని దర్శకనిర్మాతలు డిసైడ్ అయ్యారు. మహేష్ కు ఆఫర్ చేసినట్టే చరణ్ కు కూడా 30 కోట్ల పారితోషికం ఆఫర్ చేశారట నిర్మాతలు. అయితే 30 రోజుల షూటింగ్ కే చరణ్ కు 30 కోట్లు నిర్మాతలు ఆఫర్ చేస్తే.. ఇక కంప్లీట్ హీరోగా చేస్తున్న చిరంజీవి పారితోషికం ఎంత ఉంటుంది అనే డౌట్ అందరిలోనూ ఉంది.
అయితే అందుతున్న సమాచారం ప్రకారం.. ‘ఆచార్య’ నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో వచ్చే మొత్తన్ని చిరు పారితోషికంగా అందుకోబోతున్నారట. వీటి విలువ 45 కోట్ల నుండీ 50 కోట్ల మధ్యలో ఉంటుందని వినికిడి. అంటే తండ్రీ కొడుకులు ‘ఆచార్య’ చిత్రంతో 80కోట్ల వరకూ అందుకోబోతున్నట్టు స్పష్టమవుతుంది. అయితే రాంచరణ్ కూడా సహా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు కాబట్టి.. ఈ చిత్రం ప్రమోషనల్ ఖర్చులతో పాటు నిర్మాణంలో కొంత పెట్టుబడి కూడా పెడుతున్నట్టు తెలుస్తుంది.
Most Recommended Video
నిహారిక-చైతన్య నిశ్చితార్ధ వేడుకలో మెగాహీరోల సందడి..!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?