విజయ్ మాల్యా….టార్గెట్ గా చిరు సినిమా!!!

మెగా అభిమానులే కాదు….టాలీవుడ్ ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మెగాస్టార్ చిరంజీవి 150వ చిత్రం “ఖైదీ నెం 150”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న వేళ…ఈ సినిమా గురించి ఒక ముఖ్యమైన వార్త ఒకటి బయటకు వచ్చింది. అయితే అదే క్రమంలో ఈ సినిమా పై అభిమానులకు భారీ అంచనాలు ఉన్న నేపధ్యంలో స్క్రీన్‌ప్లే విషయంలో చిరు ఒకటికి 10 సార్లు చెక్ చేసుకుంటూ ఈ సినిమాలో నటిస్తున్నాడు. అయితే ఇంతకీ ఆ షాకింగ్ న్యూస్ ఏంటి అంటే…ఇప్పటికే ఈ సినిమా అంజల జావేరీ భర్త అయినటువంటి తరుణ్ అరోరా విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే…అయితే ఆ విలన్ పాత్ర ఎంలా ఉండబోతుంది అంటే…సేమ్ టు సేమ్ విజయ్ మాల్యా పాత్రలాగా ఉండబోతుంది అంట….అదేలా అంటే…ఈ విషయాన్ని సాక్షాత్తూ తరుణ్ అరోరానే చెప్పాడు.

అసలు విషయం ఏమిటంటే….ఈ సినిమా తమిళ వర్షన్ ‘కత్తి’లో విలన్ క్యారక్టర్ చాలా పోష్ గా ఉండే ఒక బిజినెస్ మ్యాన్. ఇక ఇప్పటి పరిస్థితుల్లో పాష్ గా ఉండే బిజినెస్ మ్యాన్ అంటే మనకు గుర్తుకు వచ్చేది…మన విజయ్ మాల్యానే కదా….అంతే కాకుండా తనకు విజయ్ మాల్యా తరహా క్యారక్టర్ అంటూ బ్రీఫ్ ఇచ్చారని.. ఇప్పటికే తొలి షెడ్యూల్ దిగ్విజయంగా పూర్తి చేశానని.. రెండో షెడ్యూల్ ఈ బుధవారం నుండి చెయ్యబోతున్నాను అని తరుణ్ అరోరా చెప్పడం ఈ పాత్ర మన విజయ్ మాల్యాను మైండ్ లో పెట్టుకునే డిసైన్ చేశారు అని ఇట్టే అర్ధం అయిపోతుంది…..ఇంతవరకూ భాగానే ఉంది….తమిళ సినిమా ఎవ్వరినీ విమర్శలు చేసే దిశగా ఆ క్యారక్టర్ రూపొందించలేదు ఆ సినిమా దర్శకుడు మురుగుదాస్, మరి మన తెలుగులో మసాలా కోసం ఏమైనా ఎక్కువ చేస్తే…ఇబ్బందులు తప్పవు…చూద్దాం ఎలా సాగుతుందో.

https://www.youtube.com/watch?v=YQGL2Q36NMM

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus