మాస్ మసాలా చిత్రాలు తెరకెక్కించడంలో బోయపాటి శ్రీను సిద్ధహస్తుడు. ఇక మెగా పవర్ స్టార్ రాంచరణ్ కు విపరీతమైన మాస్ ఫాలోయింగ్ ఉండగనే.. ఉంది. ఇక చరణ్ సంక్రాంతి హీరోగా కూడా గతంలో మంచి ట్రాక్ రికార్డు నమోదు చేసాడు. గతంలో ‘నాయక్’ ‘ఎవడు’ వంటి చిత్రాలతో చరణ్ సూపర్ హిట్లు నమోదు చేసాడు. ఇక చరణ్ – బోయపాటి కాంబినేషన్ కావడంతో ‘వినయ విధేయ రామా’ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
మెగాస్టార్ చిరంజీవి స్టోరీ జడ్జ్ చేయడంలో దిట్ట అని.. ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. అందులోనూ మంచి మాస్ పల్స్ కూడా తెలిసిన స్టార్ హీరో. రాంచరణ్ సినిమా వేడుకల్లో అయన మాట్లాడే విధానమే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. ముఖ్యంగా ‘రంగస్థలం’ చిత్రంలో చిరంజీవి మాట్లాడుతూ… “నా కెరీర్లో ‘ఖైదీ’ చిత్రం ఎలా అయితే నా కెరీర్లో ఓ ల్యాండ్ మార్క్ గా నిలిచిపోయిందో… అలాగే చరణ్ కెరీర్లో ‘రంగస్థలం’ చిత్రం నిలిచిపోతుంది”.. అంటూ చెప్పారు. నిజంగానే ఆ చిత్రం ఓ సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్న ‘వినయ విధేయ రామా’ పై కూడా చిరు కొన్ని ఆసక్తికరమైన కామెంట్స్ చేయడం విశేషం.
‘వినయ విధేయ రామా’ ప్రీ రిలీజ్ వేడుకలో చిరు…. “ఈ సినిమాలో చరణ్ చెప్పిన డైలాగులు నన్ను బాగా ఆకట్టుకున్నాయి. చరణ్ ఎమోషనల్ సీన్ లో డైలాగుల్ని తన నోటి వెంటే చిరు పలికారు. “అన్నా వీడిని చంపాలా… భయపెట్టాలా… భయపెట్టాలంటే 10 నిమిషాలు… చంపాలంటే పదిహేను నిముషాలు … ఛాయస్ ఈజ్ యువర్స్ … సెలెక్ట్ చేసుకో అలాగే ఇక్కడ రామ్… రామ్ కొణిదెల…“ అంటూ చరణ్ చెప్పిన డైలాగ్ ని చిరు చెప్పడం విశేషం. అంతేకాదు ఈ చిత్రంలో భారీ యాక్షన్ సీక్వెన్సుల్లో చరణ్ పెర్ఫార్మన్స్ చిరుకి చాలా నచ్చేసిందిట. ఇలాంటి యాక్షన్ సీన్ నా కెరీర్ లో పడనందుకు.. చరణ్ ని చూసి జెలసీ ఫీలయ్యానని అన్నారు చిరు.
ఇక తాజాగా ఈ చిత్ర ప్రివ్యూని చేసారంట చిరు. ఈ చిత్రంలో ఉన్న ఓ యాక్షన్ సన్నివేశం గురించి నాలుగైదు రోజులు చెప్పినా తక్కువేనని చిరు చెప్పుకురావడం విశేషం. మెగాస్టార్ ఈ కామెంట్స్ చేయడంతో.. అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిందనే చెప్పాలి. సంక్రాంతికి మాస్ చిత్రాలకి జనం క్యూలు కడతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. జనవరి 11 న విడుదల కాబోయే ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోవడం ఖాయమని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మరి ఈ చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగిడిన చిరు మాటల్లో నిజమెంతుందో తెలియాలంటే.. మరికొన్ని రోజులు వేచి చూడక తప్పదు