ఖైదీ నంబర్ 150 రిలీజ్ డేట్ ఫిక్స్

మెగాస్టార్ చిరంజీవి హీరో గా రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. మాస్ డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ప్రస్తుతం హీరోయిన్ కాజల్ అగర్వాల్, చిరు లపై రొమాన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.దీని తర్వాత ఐటమ్ సాంగ్ తీయనున్నారు. ఇందుకోసం రామోజీ ఫిలిం సిటీ లో అందమైన సెట్ వేస్తున్నారు. ఈ స్పెషల్ సాంగ్ లో చిరుతో కలిసి స్టెప్పులు వేసేందుకు సరైనోడు భామ కేథరిన్ సిద్ధంగా ఉంది.

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ఇది వరకు చిత్ర బృందం వెల్లడించింది. ఈరోజు రిలీజ్ డేట్ ని ప్రకటించింది. 2017 జనవరి 13 న ఖైదీ నంబర్ 150 మూవీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల అవుతుందని స్పష్టం చేసింది. ఇప్పటికే దాదాపు బిజినెస్ పూర్తి చేసుకున్న ఈ మూవీ పై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus