మెగా మార్క్ ఐటెం సాంగ్ కి సర్వం సిద్ధం !

“ఆట కావాలా ? పాట కావాలా ?” అంటూ అన్నయ్య సినిమాలో మెగాస్టార్ చిరంజీవి సిమ్రాన్ తో కలిసి వేసిన స్టెప్పులకు మాస్ ప్రేక్షకులు థియేటర్లలో హంగామా చేశారు. “ఆకలేస్తే అన్నం పెడుతా.. అలసివస్తే ఆయిల్ పెడుతా ” అంటూ శంకర్ దాదా ఎంబీబీఎస్ చేసిన సందడి ఇంకా మరిచి పోలేదు. అభిమానులకు కిక్ ఇచ్చే ఐటెం సాంగులు చిరు సినిమాలో తప్పకుండా ఉంటాయి. హీరో గా అయన రీ ఎంట్రీ ఇస్తున్న ఖైదీ నంబర్ 150 సినిమాలో అదరగొట్టే పాటను కంపోజ్ చేశారు రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్. ఈ పాట చిత్రీకరణకు రామోజీ ఫిలిం సిటీ లో భారీ సెట్ వేయనున్నారు. ఇందుకోసం పనులుకూడా మొదలయ్యాయి.

మాస్ పల్స్ తెలిసిన డైరక్టర్ వి.వి.వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మెగాస్టార్ 150 వ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ముందుగా యాక్షన్ సీన్స్ పై ద్రుష్టి పెట్టిన డైరక్టర్ ప్రస్తుతం హీరోయిన్ కాజల్ అగర్వాల్, చిరు లపై రొమాన్స్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ నెలకి టాకీ పార్ట్ లో కొంత భాగాన్ని పూర్తి చేసి జోష్ కోసం సాంగ్ షూటింగ్ కి వెళ్లనున్నారు. అక్టోబర్ మొదటి వారంలో ఐటెం సాంగ్ చిత్రీకరిస్తారని తెలిసింది. ఈ స్పెషల్ సాంగ్లో చిరుతో కలిసి స్టెప్పులు వేయడానికి సరైనోడు లో ఎమ్మెల్యే గా నటించిన కేథరిన్ త్రెసా పచ్చ జెండా ఊపింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ నిర్మిస్తున్న ఈ మూవీ సంక్రాంతికి విడుదల కానుంది.


Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus