టాలీవుడ్ టాప్ హీరోగా కొన్నాళ్ళు చక్రం తిప్పిన చిరు ఎవరి చెప్పినట్లుగా అకస్మాత్తుగా పార్టీ పెట్టి రాజకీయాలని శాసించాలని పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆర్ధికంగా ఆయనకు రాజకీయాలు కాస్త లాభం చేకూర్చినా, చిరు పై అభిమానుల ఆశల్ని, వారి నమ్మకాన్ని మాత్రం చిరు పూర్తిగా కోల్పోయే పరిస్థితులు ఏర్పడాయి. ఇదిలా ఉంటే ఆ గతాన్ని మరచిపోయి చిరు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే అప్పుడు సినిమా పరిశ్రమని శాసించిన చిరు, ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నాడు అని టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వాదన.
అదే క్రమంలో తానే నిర్మాతగా, సొంత సినిమా తీసుకునే పరిస్థితులు చిరుకి ఏర్పడతాయి అని ఎవ్వరూ ఊహించలేదు. అయితే ఇప్పుడు చిరు చాలా సతమతమవుతున్నాడు. రాజకీయ కురుక్షేత్రంలో ఓడిపోయి, వెనుదిరిగిన చిరు, ఇప్పుడు సినిమాల్లో సైతం అదే పరాభవం ఎదురయితే….ఆ ప్రభావం చిరు భవిష్యత్తుపై పడుతుంది అన్న ఆలోచనతో చాలా ఇబ్బంది పడుతున్నాడు మన హీరోగారు. అంతేకాకుండా ఆయన చేస్తున్న సినిమా కూడా పక్కా ఫక్తు కమర్షియల్ సినిమా కావడం, అదీ రీమేక్ సినిమా కావడంతో అభిమానులు, ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారో అని కాస్త భయంగానే షూటింగ్ లో పాల్గొంటున్నాడు చిరు.
ఇప్పటికీ యువ హీరోలు తమ ప్రతాపాన్ని చూపిస్తూ దూసుకుపోతున్న తరుణంలో రాజని లాంటి బడా హీరో సినిమా కబాలినే పెద్దగా పట్టించుకోలేదు ప్రేక్షకులు, అలాంటిది ఆయన పరిస్థితే ఇలా ఉంటే, చిరు పరిస్థితి ఇంకెలా ఉంటుంది అని మెగా ఫ్యాన్స్ కాస్త భయపడుతున్నారు….ఏది ఏమైనా…వీటన్నింటికీ కాలమే సమాధానం చెబుతుంది.