ఆ గెటప్ పవన్ ఫ్యాన్స్ కోసమేనా?
- November 30, 2016 / 05:33 AM ISTByFilmy Focus
టాలీవుడ్ లో మెగా అభిమానులకు మెగాస్టార్…పవర్ స్టార్ ఇద్దరూ రెండు కళ్ళుగా ఉండేవారు. అయితే కాలక్రమేణా అనుకోని రాజకీయ పరిణామాల వల్ల వారిద్దరూ కాస్త గ్యాప్ మేన్‌టేన్ చేస్తున్నట్లు బహిరంగంగానే తెలుస్తున్న రహస్యం. ఇక అదే క్రమంలో చిరు ఫ్యాన్స్ తో పవన్ ఫ్యాన్స్ వైరాన్ని పెంచుకుంటూ ఎవరికి వారు యమున తీరే అన్నట్లుగా తయారయ్యింది పరిస్థితి. సర్దార్ వేదికగా పవన్ చిరు తామిద్దరం ఒక్కటే అని చెప్పినప్పటికీ అది పెద్దగా కలసి రాలేదు అనే చెప్పాలి. ఇదిలా ఉంటే తాజాగా చిరు నటిస్తున్న 150వ సినిమాలో ఒక కొత్త విషయం చోటు చేసుకుంది…దీనితో ఏదోవిధంగా పవన్ అభిమానుల అభిమానాన్ని పొందడానికి మెగా శిబిరం రకరకాల విన్యాసాలు చేస్తుంది అని చెప్పడానికి ఇదే ఉదాహరణ…
ఇంతకీ ఏం జరిగింది అంటే…చాలా గ్యాప్ తరువాత చిరు నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై అంచనాలు పెంచాలి అన్న ఆలోచనతో రోజుకో స్టిల్ రిలీజ్ చేస్తూ పండగ చేసుకుంటున్నారు మెగా బ్యాచ్. అదే క్రమంలో చిరంజీవి రెడ్ షర్ట్ వేసుకుని మెరిసి పోతున్న ఒక ఫోటోను లేటెస్ట్ గా లీక్ చేసారు. ఈ రెడ్ షర్ట్ లుక్ లో మెరిసిపోతున్న చిరంజీవిని చూసి పవన్ అభిమానులు ‘అత్తారింటికి దారేది’ సినిమాలో పవన్ వేసుకున్న రెడ్ షర్ట్ లుక్ ను గుర్తుకు చేస్తోంది అంటూ పవన్ అభిమానులు పండగ చేసుకుంటున్నారు. దీనితో చిరంజీవికి పవన్ పై ఉన్న ప్రేమను ఈ లుక్ ద్వారా మరొకసారి గుర్తుకు చేస్తున్నాడు అంటూ పవన్ అభిమానులు కామెంట్స్ చేసుకుంటున్నారు. పవన్ చిరు మళ్లీ కలసిపోయినంత ఆనందాన్ని వ్యక్తం చేస్తూ పండగ చేసుకుంటున్నారు. మొత్తానికి చిరు టీమ్ అన్ని రకాలుగా సినిమాను ప్రమోట్ చేసుకుంటుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.
















