ఖైదీ ‘సెంటిమెంట్’తో టైటిల్ మారిపోయింది.!!!

కత్తిలాంటోడు…కత్తిలాంటోడు…కత్తిలాంటోడు ఇప్పుడు ఎక్కడ విన్నా ఇదే మాట. నాలుగు కుర్రాళ్ళు కలసి కూర్చుని మాట్లాడుకుంటున్నారు అంటే అది మన మెగాస్టార్ 150వ సినిమా గురించే. అయితే అలాంటి ‘కత్తిలాంటోడు’ టైటిల్ రియల్ టైటిల్ కాదు అని తెలుస్తుంది. ఇంతకీ విషయం ఏమిటంటే….దాదాపు 10ఏళ్ల గ్యాప్ తరువాత చిరు మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తూ అశేష మెగా అభిమానులకు పండగ వాతావరణం తెచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నాడు. అయితే అదే క్రమంలో ఈ సినిమా టైటిల్ ను కత్తిలాంటోడు అని పెట్టి సెట్స్ పైకి తీసుకువెళ్లే సమయానికి అంత ప్రచారం జరిగిపోయింది.

కొందరు అయితే…ఆసినిమా పేరు కత్తిలాంటోడు అని పోస్టర్లు కూడా డిజైన్‌ చేసి పెట్టేశారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ, అసలు విషయం ఇప్పుడే తెలుస్తుంది. ఈ సినిమా పేరు మన అనుకుంటున్నట్లు కత్తిలాంటోడు కానే కాదంట…విషయం ఏమిటంటే….చిరు కానీ, వినాయక్‌కానీ, రామ్‌చరణ్‌ కానీ అధికారికంగా ఈ సినిమా పేరు ఇది అని ఇప్పటివరకూ ఎక్కడా చెప్పలేదు. అయితే వాళ్ల మైండ్‌లో 150వసినిమాకు ఓ టైటిల్‌ సిద్ధంగా ఉంది. అదే… ఖైదీ నెం 150. ఎందుకంటే…. ఈ సినిమాలో చిరు డబల్ రోల్ చేస్తున్నాడు అని, ఒకరు ఖైదీ అయితే ఇంకొకడు రైతు నాయకుడు. వారిద్దరూ ఒకరి ప్లేసుల్లో ఇంకొకరు తెలీకుండా మారతారు.దీంతో.. సినిమాకు ఖైదీ నెంబర్‌ 150 అని పెడితే ఎలా ఉంటుంది అని అనుకుంటున్నాడు వినాయక్‌.

ఎందుకంటే.. మెగాస్టార్‌ ఖైదీ అనే సెంటిమెంట్‌ ఉంది. గతంలో వచ్చిన ఖైదీ, ఖైదీ నెంబర్‌ 786 సినిమాలుసూపర్‌హిట్‌ అయ్యాయి. దీంతో.. ఖైదీ నెంబర్‌ 150పైనే మెగాస్టార్‌కూడా మొగ్గుచూపుతున్నాని టాక్‌. మరి ఇదే నిజం అయితే చిరు టైటిల్ చివరకు అదే అవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus