“కత్తిలాంటోడు”కి సడన్ బ్రేక్!!!

  • July 9, 2016 / 09:21 AM IST

ప్రజారాజ్యం పార్టీతో ప్రజల్లోకి వచ్చిన చిరు ఆ ఫార్ముల వర్కౌట్ కాకపోవడంతో మళ్లీ తెలుగు ఇండస్ట్రీనే నమ్ముకుంటున్నాడు. అయితే దాదాపుగా తన 150వ సినిమాని అనౌన్స్ చేసి రెండు ఏళ్లు అయినా సినిమా మొదలు కాకపోవడంతో ఆందోళనలో ఉన్న అభిమానులకు సినిమా మొదలు పెట్టి తన స్టామినాను నిరూపించుకున్నాడు. అయితే సినిమా మొదలయ్యే సమయానికి అన్నీ కుదిరాయి కానీ, సినిమాలో చిరు సరసన ఆడి పాడే అందాల భామ మాత్రం దొరకలేదు. అయితే హీరోయిన్ కోసం వేటాడుతూనె అదే క్రమంలో తొలి షెడ్యూల్ ను పూరీ చేద్దాం అనుకుని ఫిక్స్ అయ్యి, తొలి షెడ్యూల్ ను ముగించారు.

అయితే రెండో షెడ్యూల్ స్టార్ట్ కావాలి అంటే హీరోయిన తప్పక కావాల్సిందే. అయితే హీరోయిన్స్ విషయానికే వస్తే…చిరు సరసన తొలుత సౌత్‌లో నయనతార, అనుష్క లాంటి వాళ్లను అనుకుని కుదరకపోవడంతో ఇక బాలీవుడ్ భామే బెటర్ అనుకున్నాడు నిర్మాత రామ్ చరణ్. బాలీవుడ్ హీరోయిన్ అయితే సినిమాకు నార్త్ లో మార్కెట్ కూడా పెరుగుతుందని భావించి అక్కడ సైతం ప్రయత్నాలు మొదలు పెట్టాడు. కానీ ఎవ్వరూ ఇప్పటిదాకా ఫైనలైజ్ అవ్వలేదు. దీపికా పదుకునే అన్నారు.. జాక్వెలిన్ ఫెర్నాండెజ్ అన్నారు.. ఇంకేవో పేర్లు వినిపించాయి. ఎవ్వరూ ఫైనలైజ్ కాలేదు.

ఇక వినాయక్ మాత్రం హీరోయిన లేకుండా రెండో షెడ్యూల్ చెయ్యలేం అంటూ చెబుతున్నట్లు సమాచారం. మరి చిరు పక్కన 150 వ సినిమాలో నటించిన ఆ అదృష్టం ఎవరిని వరిస్తుందో…ఎప్పటికీ తెలుస్తుందో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus