చిరు విలన్ రాజ్ తరుణ్ కోసం!
- July 18, 2016 / 02:04 PM ISTByFilmy Focus
సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్ గతంలో చిరంజీవి నటించిన ‘జై చిరంజీవ’ సినిమాలో విలన్ గా నటించి ప్రేక్షకులను మెప్పించాడు. ఇప్పుడు మరోసారి తెలుగు తెరపై కనిపించడానికి సిద్ధమవుతున్నాడు. రాజ్ టర్న్ హీరోగా వంశీకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది.
క్రైమ్, కామెడి నేపధ్యంలో సాగుతున్న ఈ సినిమాలో మొదట విలన్ గా గోవిందాను సంప్రదించారు. అయితే ఆయన పెట్టిన కండీషన్స్ యూనిట్ సభ్యులకు నచ్చకపోవడంతో అర్భాజ్ ఖాన్ ను సంప్రదించారు. ఆయన ఓకే చెప్పడంతో విలన్ గా తననే కన్ఫర్మ్ చేసారు. కొత్తదనం కోసమే బాలీవుడ్ విలన్ ను ఎన్నుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. త్వరలోనే అర్భాజ్ షూటింగ్ లో పాల్గొంటాడని చెబుతున్నారు.
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus
















