మెగాస్టార్ చిరంజీవి తనయుడిగా సినీ రంగప్రవేశం చేశారు. అతని డెబ్యూ మూవీ బాధ్యతని ‘స్టాలిన్’ ఆడియో వేడుకలో నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు పూరీ జగన్నాథ్ చేతుల్లో పెట్టారు మెగాస్టార్ చిరంజీవి. అయితే దీనికి ముందు రాజమౌళితో ‘మగధీర’ కథ ఫిక్స్ చేశారు. కానీ ఆ ప్రాజెక్టుకి ఎక్కువ టైం పడుతుందని రాజమౌళి అలాగే నిర్మాత అల్లు అరవింద్ భావించి.. వేరే దర్శకుడితో చరణ్ డెబ్యూ మూవీ చేస్తే బెటర్ అని వారు సూచించారు.
ఈ క్రమంలో వి.వి.వినాయక్ వంటి స్టార్ డైరెక్టర్లను కూడా సంప్రదించారు. అయితే ‘పోకిరి’ ఇండస్ట్రీ హిట్ అయ్యి పూరీ జగన్నాథ్ సూపర్ ఫామ్లోకి రావడంతో.. చిరు ఆ నిర్ణయం తీసుకున్నారు.అలా మొదలైన ‘చిరుత’ సినిమా 2007వ సంవత్సరం సెప్టెంబర్ 28న రిలీజ్ అయ్యింది. ఆ టైంలో ‘చిరుత’ కి ఉన్న హైప్ సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు కూడా లేదు అంటే నమ్ముతారా. అది నిజం. ఇక రిలీజ్ రోజున సినిమాకి పర్వాలేదు అనిపించే టాక్ వచ్చింది.
అయితే ఆడియో పెద్ద హిట్ అయ్యింది. సినిమాలో ఫైట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. అందువల్ల ‘చిరుత’ బాక్సాఫీస్ వద్ద బాగా పెర్ఫార్మ్ చేసి చరణ్ కి కమర్షియల్ సక్సెస్ అందించింది. నేటితో ఈ సినిమా రిలీజ్ అయ్యి 18 ఏళ్ళు పూర్తికావస్తోన్న నేపథ్యంలో క్లోజింగ్ కలెక్షన్స్ ను ఓ లుక్కేద్దాం రండి :
నైజాం | 7.02 cr |
సీడెడ్ | 5.34 cr |
ఉత్తరాంధ్ర | 2.40 cr |
ఈస్ట్ | 1.64 cr |
వెస్ట్ | 1.58 cr |
గుంటూరు | 2.06 cr |
కృష్ణా | 1.62 cr |
నెల్లూరు | 1.05 cr |
ఏపీ + తెలంగాణ (టోటల్) | 22.71 cr |
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ | 2.48 cr |
వరల్డ్ వైడ్ (టోటల్) | 25.19 cr |
‘చిరుత’ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించడానికి రూ.18 కోట్ల షేర్ ను రాబట్టాలి.అయితే ఫుల్ రన్ ముగిసేసరికి ఈ సినిమా ఏకంగా రూ.25.19 కోట్ల షేర్ ను రాబట్టింది. మొత్తంగా ఈ మూవీ రూ.7.19 కోట్ల లాభాలు అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. డెబ్యూ హీరోల్లో ఈ సినిమా ఆల్ టైం రికార్డు సృష్టించింది అని చెప్పాలి.