బ్రేక్ ఈవెన్ సాధించాడు… కానీ అంత కాదు..!

6 ప్లాపుల తర్వాత తేజు కి ఓ హిట్టొచ్చింది. తను హీరోగా నటించిన తాజా చిత్రం ‘చిత్రలహరి’ ఫైనల్ కలెక్షన్స్ వచ్చాయి. బ్రేక్ ఈవెన్ ను సాధించి హిట్ లిస్ట్ లో చేరింది ఈ చిత్రం. కళ్యాణి ప్రియదర్శన్, నివేధా పేతురేజ్ హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రాన్ని కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసాడు. ఈ చిత్రంలో సునీల్ కూడా ప్రత్యేక పాత్ర పోషించాడు. ఇక ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల షేర్ ను వసూల్ చేసింది.

‘చిత్రలహరి’ క్లోజింగ్.. ఏరియా వైజ్ కలెక్షన్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి :

నైజాం – 4.54 కోట్లు
సీడెడ్ – 2.22 కోట్లు
వైజాగ్ – 1.90 కోట్లు


ఈస్ట్ – 1.05 కోట్లు
కృష్ణా – 0.83 కోట్లు
గుంటూరు – 0.98 కోట్లు


వెస్ట్ – 0.78 కోట్లు
నెల్లూరు – 0.55 కోట్లు
————————————————
ఏపీ + తెలంగాణ – 12.85 కోట్లు


రెస్ట్ అఫ్
ఇండియా – 1.45 కోట్లు
ఓవర్సీస్ – 0.70 కోట్లు (కరెక్టడ్)
————————————————-
వరల్డ్ వైడ్ టోటల్ – 15 కోట్లు (షేర్)
————————————————–

‘చిత్రలహరి’ చిత్రానికి 13 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. క్లోజింగ్ 15 కోట్ల షేర్ ను రాబట్టింది. అయితే ఇవి తేజు రేంజ్ కలెక్షన్లు కావు. ఈ మధ్య ప్లాపులతో బాగా వెనుకపడ్డాడు… కాబట్టి ఈ చిత్రం కాస్త రిలీఫ్ ఇచ్చిందనుకోవాలి. ఏదేమైనా దాదాపు మూడేళ్ళ తరువాత సాయి తేజ్ కు ఓ హిట్టు దక్కింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus