డ్యాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ (Jani Master) కేసు మరోసారి వార్తల్లోకి వచ్చింది. బెయిల్ మీద ప్రస్తుతం బయట ఉన్న ఆయన.. ఉదయమే సంధ్య థియేటర్ ఘటన బాధితుడు శ్రీతేజ్‌ను పరామర్శించడానికి వెళ్లారు. అక్కడ ఆయన చేసిన వ్యాఖ్యల విషయంలో పంచాయితీ నడుస్తున్న సమయంలోనే ఆయన కేసుకు సంబంధించి అప్‌డేట్ వచ్చింది. ఈ కేసులో పోలీసులు ఛార్జిషీట్ ఫైల్ చేశారని, అందులో ఆయన తప్పు చేసినట్లు రాశారు అని వార్తలొచ్చాయి. ఈ విషయంలో జానీ మాస్టర్ బుధవారం రాత్రి ఓ వీడియోను సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.
Jani Master
న్యాయస్థానంపై తనకు నమ్మకముందని, నిర్దోషిగా బయటకొస్తానని జానీ మాస్టర్ అన్నారు. బుధవారం తన గురించి వచ్చిన వార్తలను నమ్మొద్దని, అసలు ఏం జరిగిందో తనకు, దేవుడికి మాత్రమే తెలుసన్నారు. ఏదైనా న్యాయస్థానం నిర్ణయిస్తుందని చెప్పారు. అంతేకాదు క్లీన్‌చిట్‌తో బయటకొస్తానని, అప్పుడు మాట్లాడతానని చెప్పారు. అప్పటివరకు తాను నిందితుడిని మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. జానీ మాస్టర్ కొన్ని నెలల క్రితం తీవ్రమైన Laiగిక ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే.
తనపై వేధింపులకు పాల్పడ్డాడంటూ ఆయన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పని చేసిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తాను మైనర్‌గా ఉన్న సమయంలో Laiగిక వేధింపులకు పాల్పడ్డారని కూడా ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ విషయంలో జానీ మాస్టర్‌ను అరెస్టు చేసి జైలుకు తరలించారు. 40 రోజులు రిమాండ్‌లో ఉన్న జానీ మాస్టర్‌కు కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ను ఇచ్చింది.
ఇక ప్రస్తుతం జానీ మాస్టర్ బయటకు వచ్చి తన పని తాను చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. రామ్‌చరణ్ (Ram Charan) – బుచ్చిబాబు (Buchi Babu Sana) సినిమాలో ఓ పాటకు కొరియోగ్రఫీ చేసే అవకాశం కూడా వచ్చింది అని సమాచారం. ఈ లోపు ఛార్జిషీట్ విషయం బయటకు రావడం గమనార్హం. అన్నట్లు మీ అరెస్టు విషయంలో అల్లు అర్జున్ పాత్ర ఉందా అని జానీ మాస్టర్‌ను అడిగితే.. ఏం చెప్పకుండా పక్కకు వెళ్లిపోయారు.
When we all see justice, then we’ll all see peace!!