ముద్దు విషయంలో చోటా ఇచ్చిన స్టేట్మెంట్ లో కొరవడిన క్లారిటీ

మొన్న జరిగిన “కవచం” ప్రెస్ మీట్ లో కాజల్ ను కెమెరామెన్ ఛోటా కె.నాయుడు ముద్దు పెట్టుకోవడం పెద్ద రాద్ధాంతానికి తెరలేపిన విషయం తెలిసిందే. కాజల్ స్టేజ్ మీద చోటాను ఏమీ అనలేక “ఛాన్స్ పే డ్యాన్స్” అంటూ కామెంట్ చేసి తిట్టినంత పని చేసింది. ఇక కాజల్ ఫ్యాన్స్ అయితే కోపంతో “బ్యాన్ ఛోటా కె నాయుడు ఫ్రమ్ తెలుగు ఫిలిమ్ ఇండస్ట్రీ” అనే హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేశారు కూడా. ఈ విషయమై కాస్త లేట్ గా స్పందించిన ఛోటా కె.నాయుడు “సౌందర్య తర్వాత నేను అంతగా అభిమానించింది కాజల్ ను మాత్రమే. ఆ చొరవతోనే నేను కాజల్ ను ముద్దు పెట్టుకొన్నాను తప్పితే నాకు ఎలాంటి దురుద్దేశం లేదు” అని చెప్పుకొచ్చాడు.

అయితే.. ఛోటా కాజల్ విషయంలో ఇచ్చిన వివరణ బాగానే ఉంది కానీ.. అదే ఈవెంట్ లో పాల్గొన్న మరో హీరోయిన్ మెహరీన్ విషయంలో ఛోటా బిహేవియర్ కి కారణం ఎంటా అని అడుగుతున్నారు. ఛోటా కె.నాయుడు స్టేజ్ మీద కాజల్ ను ముద్దాడడాని కంటే ముందు అదే ఈవెంట్ లో పాల్గొన్న మరో హీరోయిన్ మెహరీన్ నడుము కూడా గిల్లాడట. ఈ విషయానికి వీడియో ప్రూఫ్ లేకపోయినప్పటికీ.. అక్కడ ఈవెంట్ లో పాల్గొన్న చాలా మంది ఈ విషయానికి సాక్ష్యులు. కాజల్ కి ముద్దు పెట్టడంపై వివరణ ఇచ్చిన ఛోటా కె.నాయుడు మరి మహారీన్ నడుం గిల్లడం గురించి ఎలాంటి క్లారిటీ ఇస్తాడనేది వేచి చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus