టాప్ ప్రొడక్షన్ హౌస్ కి వ్యతిరేకంగా దర్శకుడి వ్యాఖ్యలు!

  • December 9, 2020 / 01:56 PM IST

ప్రముఖ హాలీవుడ్ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్ ఇటీవల ఓ సంచలన నిర్ణయంతో ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. 2021లో తమ సంస్థలో రాబోతున్న సినిమాలను థియేటర్లతో పాటు ఓటెటీలో కూడా ఒకేసారి విడుదల చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ సంస్థలో ప్రస్తుతం ‘ది సుసైడ్ స్క్వాడ్’, ‘టామ్ అండ్ జెర్రీ’, ‘ది కంజూరింగ్: ది డెవిల్ మేక్ మి డు ఇట్’, ‘కింగ్ రిచర్డ్’ లాంటి భారీ సినిమాలు ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

వీటిని కేవలం థియేటర్లో మాత్రమే రిలీజ్ చేస్తే ఆశించిన రెవెన్యూ రాదని భావించిన వార్నర్ బ్రదర్స్.. థియేటర్ తో పాటు హెచ్‌బీవో మ్యాక్స్‌ ఓటీటీలోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ఈ ప్రొడక్షన్ హౌస్ తో మంచి అనుబంధం ఉన్న క్రిస్టోఫర్ నోలన్ లాంటి అగ్ర దర్శకుడు కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2021లో పరిస్థితుల మీద అప్పుడే ఓ అంచనాకు వచ్చేసి తమ సినిమాలన్నింటినీ ఒకేసారి థియేటర్లతో పాటు ఓటీటీలో రిలీజ్ చేయడం కరెక్ట్ కాదంటూ నోలన్ అన్నాడు.

ఈ సంస్థతో చాలా మంది దర్శకులు, ఆర్టిస్ట్ లు కలిసి పని చేస్తున్నారని.. వారంతా తమ సినిమాలను ప్రేక్షకులు తెరపై చూడాలని ఆశలు పెట్టుకున్నారని.. అలాంటిది ఎవరినీ సంప్రదించకుండా నిర్ణయం ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాదు. వార్నర్ బ్రదర్స్ ఒప్పందం చేసుకున్న హెచ్‌బీవో మ్యాక్స్ మీద నోలన్ కామెంట్స్ చేశారు. అదొక వరస్ట్ స్ట్రీమింగ్ సర్వీస్ అని నోలన్ అనడం ఇప్పుడు చర్చనీయాంశమైంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus