టాప్ డైరక్టర్స్ పై సినీ ప్రియుల అభిప్రాయం

ప్రతి ఎనిమిది సంవత్సరాలకు సినీ ప్రేక్షకులు మారుతారని ఓ సినీ విశ్లేషకుడు చెప్పారు. అందులో వాస్తవం లేకపోలేదు. మారిన ప్రేక్షకులకు అనుగుణంగా ఫిలిం మేకర్స్ ఆలోచనలు కూడా మారాలి. లేకుంటే నిర్దాక్షిణ్యంగా వారి సినిమాలను వెనక్కి పంపించేస్తారు. అలనాటి టాప్ దర్శకుల సినిమాల విషయాల్లో అలాగే జరుగుతోంది. తెలుగు వ్యక్తి అయినప్పటికీ రామ్ గోపాల్ వర్మ బాలీవుడ్ లో గొప్ప దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు అతను తీస్తున్న సినిమాలు నేటి తరం ప్రేక్షకులను అసలు ఆకట్టుకోవడం లేదు. రీసెంట్ గా నాగార్జునతో చేసిన ఆఫీసర్ మూవీ ఘోరంగా పరాజయం పాలైంది. ఇక వర్మ శిష్యుల్లో ఒకరైన

కృష్ణవంశీ గతంలో గులాబీ, నిన్నే పెళ్ళాడుతా, చందమామ వంటి మంచి మూవీలు తీశారు. అతని దర్శకత్వంలో నటించాలని స్టార్ హీరోలు ఆశపడేవారు. ఇప్పుడు యువహీరోలు సైతం భయపడుతున్నారు. కారణం పదేళ్లుగా ఒక్క హిట్ కూడా లేకపోవడమే. గత ఏడాది వచ్చిన నక్షత్రం కూడా మెప్పించలేకపోయింది.

లేడీస్ టైలర్, అన్వేషణ వంటి చిత్రాలు తీసి క్లాసిక్ డైరక్టర్ గా పేరుతెచ్చుకున్న సీనియర్ వంశీ హిట్ ని కొట్టలేకపోతున్నారు. అతని గత చిత్రం “ఫ్యాషన్ డిజైనర్ సన్నాఫ్ లేడీస్ టైలర్” భారీ నష్టాన్ని మిగిల్చింది. వేగంగా సినిమాలు తీసి డేరింగ్, డాషింగ్ గా పేరుతెచ్చుకున్న పూరి జగన్నాథ్ కెరీర్ మొదట్లో చేసిన సినిమాలన్నీ హిట్స్ సాధించాయి. హీరోలెవరైనా సరే హిట్ గ్యారంటీ అనే పేరు తెచ్చుకున్నారు. ఇప్పుడు ఎంత ప్రయత్నించినా విజయం అందుకోలేకపోతున్నారు. ఎంతో కష్టపడి తన కొడుకు ఆకాష్‌తో తీసిన మెహబూబా మూవీ పూరి పై ఆశలను పోగొట్టింది. అందుకే ఈ నలుగురు డైరక్షన్ చేయడం మానేస్తే.. వారిపైన గౌరవం అయినా మిగిలి ఉంటుందని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus