తమిళ స్టార్ హీరో, టీవీకే పార్టీ అధినేత విజయ్ ఇటీవల తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పరిణామాలతో వార్తల్లో నిలుస్తున్నారు. ఇప్పటికే భార్య సంగీతకు ఆయన మధ్య విడాకుల ప్రక్రియ కొనసాగుతున్న నేపథ్యంలో, తాజాగా కోర్టులో జరిగిన ఒక కొత్త పరిణామం సినీ వర్గాల్లో చర్చకు దారితీసింది. చెన్నైలోని చెంగల్పట్టు ఫ్యామిలీ కోర్టులో సంగీత మరో పిటిషన్ దాఖలు చేసినట్లు సమాచారం.
విడాకుల కేసు ఇంకా తుది నిర్ణయానికి రాకముందే, చెన్నైలోని నీలంకరై ప్రాంతంలో ఉన్న విజయ్ నివాసంపై సంగీత తన హక్కును ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఆ ఇంటిలో తానూ నివసించే హక్కు ఉందని పేర్కొంటూ, కేసు పూర్తయ్యే వరకు అక్కడే ఉండేందుకు అనుమతి ఇవ్వాలని కోర్టును కోరినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ పరిణామం బయటకు రావడంతో, విజయ్ వ్యక్తిగత జీవితం మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.
ఇదే సమయంలో విజయ్ గురించి మరో విషయం కూడా అభిమానుల దృష్టిని ఆకర్షించింది. ఇటీవల చెన్నైలో జరిగిన ఒక ప్రముఖ కుటుంబ వేడుకకు విజయ్ మరియు హీరోయిన్ త్రిషతో కలిసి హాజరై అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఆ కార్యక్రమంలో ఇద్దరూ కలిసి కనిపించడంతో వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
కాగా ఈ వేడుకలో విజయ్ సంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, త్రిష కూడా అందమైన సిల్క్ చీరలో మెరిసింది. వేడుకలో ఇద్దరూ కలిసి అతిథులతో మాట్లాడిన దృశ్యాలు అభిమానులను ఆకట్టుకున్నాయి. ఒకవైపు వ్యక్తిగత జీవితంపై చర్చలు జరుగుతుండగా, అభిమానులు ఏమో విజయ్ కు ఎవరితో ఏ సంబంధాలు లేవని ప్రూవ్ చేయటానికి ప్రయత్నాలు చేస్తుంటే, ఇంకో వైపు విజయ్ , త్రిషతో కలిసి ఫంక్షన్ కి హాజరు అవ్వటం అభిమానులకు మింగుడు పడటం లేదు.
ఇక సినిమాల విషయానికి వస్తే, విజయ్ తన తదుపరి చిత్రం “జన నాయకన్” విడుదలకు సిద్ధమవుతున్నారు. కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఈ సినిమా విడుదల కొంత ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. రాజకీయాలు, సినిమాలు, వ్యక్తిగత జీవితం.. ఇలా అన్నివిధాలుగా విజయ్ నిత్యం వార్తలు వస్తుండటంతో తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయో అని అభిమానుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది.