Cinematographer: గ్యాంగ్‌స్టర్‌కి ఆ హిట్‌ సినిమా కలిపిపే ‘భోళా’.. ఎవరన్నారంటే?

బాలీవుడ్‌, టాలీవుడ్‌ కంపారిజన్‌ ఒకప్పుడు చేసేటప్పుడు హిందీ పరిశ్రమ గురించి చాలా గొప్పగా మాట్లాడేవారు. కొందరైతే అక్కడ కష్టమే అనేవారు అనుకోండి. అయితే ఇప్పుడు బాలీవుడ్ గ్రాఫ్‌ పడిపోయింది, మరోవైపు బాలీవుడ్‌లోని ఇబ్బందులు బయటకు తీసేవాళ్లూ కూడా ఎక్కువయ్యారు. అక్కడి స్టార్‌ హీరో అక్షయ్‌ కుమారే… బాలీవుడ్‌ నటుల ఆలోచనా విధానం మారాలి అన్నాడు. తాజాగా బాలీవుడ్‌లో ‘చెన్నై ఎక్స్‌ప్రెస్‌’, ‘దిల్‌వాలే’, ‘సింగమ్‌’, ‘గోల్‌మాల్‌ 3’ లాంటి సినిమాలకు సినిమాటోగ్రాఫర్‌గా పని చేసిన డడ్లీ కూడా ఇలానే మాట్లాడారు. డడ్లీ ‘భోళాశంకర్‌’ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టారు. చిరంజీవి కథానాయకుడిగా మెహర్‌ రమేశ్‌ దర్శకత్వంలో రూపొందిన చిత్రమిది.

ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగానే బాలీవుడ్‌ సినిమాలో లేనిది, ఇక్కడ ఉన్న విషయం గురించి మాట్లాడారు. హిందీ చిత్ర పరిశ్రమతో పోలిస్తే తెలుగు చిత్ర పరిశ్రమలో సమయపాలన ఎక్కువ. వృత్తిపరంగా ఇక్కడ చాలా నిబద్ధతతో ఉంటారు అని కామెంట్‌ చేశారు డడ్లీ. దీనికి సెట్స్‌లో చిరంజీవి ఎలా ఉంటారు అనే విషయాన్ని ఉదహరించారు. చిరంజీవి ఉదయం ఏడు అంటే ఏడింటికే మేకప్‌తో సహా సెట్స్‌లో ఉంటారు. ఎప్పుడు యాక్షన్‌ చెబుతామా అని వెయిట్‌ చేస్తుంటారు.

షాట్స్‌ మధ్య గ్యాప్‌లో కార్‌వ్యాన్‌లోకి కూడా వెళ్లరు. సినిమాల విషయంలో ఆయనొక ఎన్‌సైక్లోపీడియా లాంటివారు. 40 ఏళ్ల అనుభవం ఆయన వెనక ఉంది. ఆ అనుభవంతోనే సెట్‌లో ఉన్నప్పుడు చాలా ఆసక్తికర విషయాలు చెబుతుంటారు. రోజూ ఏదో ఒక కొత్త అంశం ఆయన్నుంచి నేర్చుకుంటూనే ఉంటాను అని చిరంజీవి గురించి వివరించారు డడ్లీ. ‘భోళా శంకర్‌’ దర్శకుడు మెహర్‌ రమేశ్‌ పదేళ్లుగా తనకు స్నేహితుడని, ముంబయి ఎప్పుడు వచ్చినా తనను (Cinematographer) కలుస్తుంటారని చెప్పారు డడ్లీ.

లాక్‌డౌన్‌ సమయంలో ఓసారి ఫోన్‌ చేసి మనం ఓ సినిమా చేస్తున్నాం అని చెప్పారట. హీరో ఎవరో చెప్పుకో చూద్దాం అని అన్నారట. దానికి డడ్లీ కొంతమంది పేర్లు చెప్పారట. వాళ్లెవరూ కాదు చిరంజీవి అని చెప్పారట. దాంతో డడ్లీ షాక్‌ అయ్యారట. ఆ తర్వాత థ్రిల్‌ అయ్యారట. అలా ఈ సినిమాలోకి వచ్చాను అని చెప్పారు. ఇక ఈ సినిమా గురించి చెప్పండి అంటే.. గ్యాంగ్‌స్టర్‌ సినిమాకు ‘శంకర్‌ దాదా ఎంబీబీఎస్‌’ కలిస్తే ఎలా ఉంటుందో.. ఈ సినిమా అలా ఉంటుంది అని చెప్పారు.

ఆ హీరోయిన్ ఎంత రెమ్యునరేషన్ తీసుకుంటుందో తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ ‘బలగం’ తో పాటు చావు కాన్సెప్ట్ తో రూపొందిన 10 సినిమాల లిస్ట్..
హైప్ లేకుండా రిలీజ్ అయిన 10 పెద్ద సినిమాలు… ఎన్ని హిట్టు… ఎన్ని ప్లాప్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus