రిలీజ్ డేట్ మార్పుపై ఆదిపురుష్ నిర్మాతలు ఏమన్నారంటే?

2023 సంవత్సరం సంక్రాంతి పండుగ కానుకగా భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదలవుతుండటంతో ఈ సినిమాలకు థియేటర్లను సర్దుబాటు చేయడం చాలా కష్టమవుతోంది. ఆదిపురుష్ సినిమా టీజర్ కు నెగిటివ్ టాక్ రావడం, సంక్రాంతి పండుగకు గట్టి పోటీ ఉండటం, మైథలాజికల్ బ్యాక్ డ్రాప్ లో ఆదిపురుష్ సినిమా తెరకెక్కడంతో సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ కావడం సులువు కాదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

అయితే వైరల్ అవుతున్న వార్తల గురించి ఆదిపురుష్ మేకర్స్ స్పందించి స్పష్టత ఇచ్చారు. వైరల్ అవుతున్న వార్తల్లో ఏ మాత్రం నిజం లేదని ఆదిపురుష్ మూవీ చెప్పిన తేదీకే థియేటర్లలో విడుదలవుతుందని మేకర్స్ చెప్పుకొచ్చారు. ఆదిపురుష్ మొదట ప్రకటించిన డేట్ కే విడుదలవుతుందని ఇందులో సందేహం అవసరమవుతుందని మేకర్స్ కామెంట్లు చేశారు. సంక్రాంతి పండుగకు ఏకంగా ఐదు సినిమాలు ఫిక్స్ అయ్యాయి.

2023 సంవత్సరం జనవరి 12వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుందని సమాచారం అందుతోంది. ఈ సినిమాకు ఇప్పటికే థియేటర్లను బ్లాక్ చేస్తున్నారని తెలుస్తోంది. ప్రభాస్ కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లతో ఎలంటి ఫలితాలను సొంతం చేసుకుంటారో చూడాల్సి ఉంది. ప్రభాస్ పారితోషికం అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే.

ప్రభాస్ తర్వాత ప్రాజెక్ట్ లపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఆదిపురుష్, సలార్ సినిమాలతో ప్రభాస్ బాక్సాఫీస్ వద్ద సంచలనాలను సృష్టించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సినిమాసినిమాకు ప్రభాస్ రేంజ్ అంతకంతకూ పెరుగుతున్న సంగతి తెలిసిందే. ప్రభాస్ త్వరలో కొత్త ప్రాజెక్ట్ లను కూడా ప్రకటించనున్నారని వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. సినిమాసినిమాకు ప్రభాస్ ను అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది.

జిన్నా సినిమా రివ్యూ& రేటింగ్!

Most Recommended Video

ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus