చిన్న సినిమాగా విడుదలై.. భారీ విజయం అందుకుంది… ఈ మాటకు రీసెంట్ ఎగ్జాంపుల్ ‘కాంతార’. రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో నటించిన చిత్రమిది. కన్నడ నాట సాధారణ సినిమా మొదలై, విడుదలై.. ఇప్పుడు పాన్ ఇండియా రేంజిలో అదరగొడుతోంది. థియేటర్లకు వెళ్లకుండా ఓటీటీయన్స్‌గా మారిపోయిన ప్రేక్షకులు.. ఈ సినిమా ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. అయితే వారికి సినిమా టీమ్ చేదు వార్త అందించింది. నవంబర్ 4 నుండి ఓటీటీలోకి ‘కాంతార’ సినిమా రానుందని గత కొద్ది రోజులుగా గుసగుసలు వినిపిస్తున్నాయి.
రిషబ్ శెట్టి సినిమాలన్నీ ఆ ‘తెలుగు’ ఓటీటీలోనే వస్తాయని కూడా యాడ్ చేసి చెబుతున్నారు. మొదట కన్నడ సీమలో మొదలైన ఈ రూమర్ ఇప్పుడు సినిమా టాక్‌లా దేశం మొత్తం పాకేసింది. తాజాగా దీనిపై ‘కాంతార’ సినిమా క్రియేటివ్ ప్రొడ్యూసర్ కార్తిక్ గౌడ స్పందించారు. సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ మాటలు ఒట్టి రూమర్స్ అని కొట్టిపడేశారు. ఈ మేరకు ట్విటర్‌లో రాసుకొచ్చారు. నవంబరు 4 నుండి ఓటీటీలోకి ‘కాంతార’ సినిమా వస్తోంది అనేది రూమర్ మాత్రమే.
ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందనేది మేమే చెప్తాం అని కార్తిక్ గౌడ ట్వీట్ చేశారు. సెప్టెంబరు 30న కన్నడలో విడుదలైన ఈ సినిమా అక్టోబరు 15 నుండి తెలుగులో రిలీజ్ అయ్యింది. విడుదలైన తొలి రోజు నుండే మంచి టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో సినిమా ఓటీటీ డేట్ విషయంలో టీమ్ ఇంకా ఆలోచన చేస్తోందట. మొన్న దీపావళికి వచ్చిన సినిమాల కంటే ‘కాంతార’ సినిమా వసూళ్లే బాగున్నాయట.
దీంతో ఈ సినిమాను ఇంకొన్ని రోజులు థియేటర్లలో ఉంచుదాం అని అనుకుంటున్నారట. దీంతో ఓటీటీ డేట్ విషయంలో ఇంకా తర్జన భర్జనలు జరుగుతున్నాయట. నవంబరులో మొదటి వారం కాకుండా.. రెండో వారంలో కానీ, మూడో వారంలోనాఈ ఈ సినిమా ఓటీటీకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. అన్నట్లు నవంబరు 14న ఈ సినిమాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చూస్తారని టాక్.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!