ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) , స్టార్ డైరెక్టర్ సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప’ (Pushpa) పెద్ద హిట్ అయిన సంగతి తెలిసిందే. దానికి సీక్వెల్ గా ‘పుష్ప 2’ (Pushpa 2: The Rule) కూడా రూపొందింది. భారీ అంచనాల నడుమ ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ‘పుష్ప 2’ .దేశవ్యాప్తంగా ఉన్న అల్లు అర్జున్ అభిమానులు చాలా కాలంగా ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. ఫైనల్ గా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
అన్ని ఏరియాల నుండి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తుంది. టికెట్ రేట్లు డబుల్ చేసినా అభిమానులు తగ్గకుండా థియేటర్లకు వస్తుండటం విశేషంగా చెప్పుకోవాలి. ఇదిలా ఉండగా.. ‘పుష్ప 2’ లో కూడా కొన్ని మైనస్సులు ఉన్నాయి. కానీ కొన్ని బ్లాక్స్ బాగా వర్కౌట్ అయ్యాయట. మాస్ ఆడియన్స్, ఫ్యాన్స్.. కి అవి గూజ్ బంప్స్ తెప్పించడమే కాకుండా.. రిపీటెడ్ గా థియేటర్స్ కి వచ్చేలా చేస్తాయట.
ముందుగా.. పోలీస్ స్టేషన్ సీన్. పుష్ప అనుచరులను షెకావత్ అరెస్ట్ చేస్తే.. అతను స్టేషన్ కి వెళ్లి అందరినీ విడిపిస్తాడు. అందుకు పోలీసులు తమ ఉద్యోగాలు పోతాయి అని చెబితే.. వాళ్లందరికీ లైఫ్ టైం సెటిల్మెంట్ చేసి ఉద్యోగాలు మానిపించేస్తాడు.
అలాగే ఇంటర్వెల్లో విలన్ కి సారీ చెప్పే సీన్, ఆ తర్వాత వచ్చే సీన్.. అందరితో విజిల్స్ కొట్టించే విధంగా ఉంటాయి.
ఇక సెకండాఫ్లో వచ్చే గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్లో అల్లు అర్జున్ డాన్స్ అలాగే తన భార్య శ్రీవల్లితో చెప్పే ఎమోషనల్ డైలాగ్స్ ఫ్యామిలీ ఆడియన్స్ ని ఆకట్టుకుంటాయి.
ఇక క్లైమాక్స్ లో అజయ్ (Ajay) పాత్ర ఇంటికొచ్చి శుభలేఖ ఇవ్వడం, అందులో పుష్పరాజ్ పేరు పక్కన తన ఇంటి పేరు ఉండటం.. ఆ తర్వాత అతను పలికే డైలాగులు, వాటికి హీరో కన్నీళ్లు పెట్టుకోవడం వంటివి అందరితో కన్నీళ్లు పెట్టించే విధంగా ఉంటాయి.