‘పుష్ప 2’ (Pushpa2 The Rule) సినిమా నిన్న గ్రాండ్ గా రిలీజ్ అయ్యింది. అల్లు అర్జున్ (Allu Arjun) – సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ఈ 4వ ప్రపంచవ్యాప్తంగా 12500 థియేటర్లలో విడుదలైంది. మొదటి షో నుండే సినిమాకి హిట్ టాక్ రావడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు నమోదయ్యాయి. మొదటి రోజు రూ.300 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి అని ట్రేడ్ పండితుల సమాచారం. ఇదిలా ఉండగా… ‘పుష్ప 2’ సినిమా విషయంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ సూపర్ హ్యాపీగా ఉన్నట్టు స్పష్టమవుతుంది. దర్శకుడు సుకుమార్ ‘నిజంగానే అల్లు అర్జున్ పై ప్రేమ ఉన్నట్టు..
అతని ఎలివేషన్ సీన్స్ ను ఎంతో మనసుపెట్టి రాసుకున్నాడు’ అని వాళ్ళు సంబరపడుతున్నారు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ ‘పుష్ప 2’ విషయంలో సుకుమార్ ‘పుష్ప’ (Pushpa) మిగిలిన ప్రశ్నలకి సమాధానాలు ఇవ్వలేదు అనేది అందరి అభిప్రాయం. మొదటి భాగంలో జాలి రెడ్డి పాత్రకు సంబంధించిన క్లారిటీ పుష్ప 2 లో ఇచ్చింది లేదు. అలాగే ‘పుష్ప 2’ ట్రైలర్లో ఉన్న కొన్ని విజువల్స్ కూడా సినిమాలో మిస్ అయ్యాయి. అవి పై ఫొటోలో మీరు చూడొచ్చు.
‘పుష్ప 2’ ట్రైలర్ ని కనుక గమనిస్తే :
పుష్ప రాజ్ పాత్ర ఓ షిప్లో నిలబడి ఉంటుంది. అది సినిమాలో లేదు.
క్యారెక్టర్ ఇంట్రడక్షన్ అంటూ పుష్పరాజ్ ని పులితో పోల్చి చెప్పిన విజువల్ కూడా మిస్సింగ్
షెకావత్ నదిలో స్నానం చేస్తున్నట్టు ట్రైలర్లో ఓ విజువల్ ఉంది. అది కూడా సినిమాలో లేదు.
అలాగే పుష్పరాజ్ పాత్ర చేతిలో ఒక నోటు ఉన్నట్టు కూడా ఓ విజువల్ ఉంది. అది కూడా సినిమాలో మిస్సింగ్.