Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Green Ammonia

Filmy Focus » Movie News » Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

  • April 28, 2026 / 03:30 PM ISTByFilmy Focus Desk
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Samyuktha: కోల్‌ సిండికేట్‌ తుట్టె కదుపుతున్న స్టార్‌ హీరోయిన్‌.. రిస్క్‌ చేస్తున్నారా?

‘హీరో’యిన్‌లు ఎక్కడి నుండో పుట్టుకురారు.. హీరోయిన్‌గా సినిమాలు చేస్తున్నప్పుడు దర్శక, రచయితలు చూసి ఈ కథానాయిక.. కథా‘నాయక’ అవుతుంది అనిపిస్తుంది. అప్పుడే హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలు వస్తాయి. వన్స్‌ క్లిక్‌ అయితే ఇకపై అలాంటి పాత్రలు వరుస కడతాయి. అలా వచ్చి లేడీ సూపర్‌ స్టార్‌ అయ్యారు విజయశాంతి, నయనతార లాంటివాళ్లు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అనుకుంటున్నారా? ఈ కోవలోకి వచ్చే ప్రయత్నంలోనే ఉంది సంయుక్త.

Samyuktha

హీరోయిన్‌గా మంచి విజయం అందుకున్న సినిమాలు చేసిన సంయుక్త.. ఇప్పుడు ‘ది బ్లాక్‌ గోల్డ్‌’ సినిమాతో తనలోని యాక్షన్‌ కోణాన్ని చూపించేందుకు సిద్ధమవుతోంది. యోగేశ్‌ కేఎంసీ తెరకెక్కిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ ఇటీవల పూర్తయింది. ఈ మేరకు సినిమా టీమ్‌ ఓ మేకింగ్‌ వీడియోను విడుదల చేసింది. తెలంగాణ – మహారాష్ట్ర సరిహద్దుల్లోని బొగ్గు గనుల కేంద్రంగా జరిగే కథ ఈ సినిమా అని సమాచారం. చేతిలో గన్‌ ఉన్నప్పటికీ చట్టమే ముఖ్యం అని భావించే ఒక పోలీసు ఆఫీసర్‌ చుట్టూ తిరుగుతుంది.

కొన్నేళ్ల క్రితం దేశాన్ని ఓ కుదుపు కుదిపేసిన కోల్‌ సిండికేట్‌ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందట. నిజ జీవిత సంఘటనల స్ఫూర్తితో ఈ సినిమాను ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారట. 5 షెడ్యూల్స్‌లో 60 రోజుల్లో సినిమాను పూర్తి చేశామని టీమ్‌ చెప్పింది. మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆదిలాబాద్, హైదరాబాద్‌ తదితర ప్రాంతాల్లో 10కి పైగా సెట్లు వేసి మరీ సినిమా తీశారట. రోజూ 300 మందికి పైగా ఈ సినిమా పనుల్లో ఉండి తెరకెక్కించినట్లు సినిమా టీమ్‌ ఆ మేకింగ్ వీడియోలో పేర్కొంది.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను తెలుగుతోపాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ పాన్‌ ఇండియా లెవల్‌లో విడుదల చేయాలని నిర్మాతలు ప్లాన్‌ చేస్తున్నారట. మరి అనుకున్నట్లుగానే ఆ స్థాయిలో సినిమా వస్తే మరో పాన్‌ ఇండియా హీరోయిన్‌ను మనం సౌత్‌ నుండి ఇవ్వొచ్చు.

 అదిరిపోయిన త్రివిక్రమ్‌ ‘ప్రాస’ స్పీచ్‌.. నాటి రోజులు గుర్తు చేసుకుంటూ..

https://www.youtube.com/watch?v=wnKKqOwIEvw

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Samyuktha

Also Read

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

Toxic Collections: ఆ 2 ఏరియాల్లో తప్ప.. మిగిలిన అన్ని చోట్లా స్లీప్ వేసింది

related news

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Nag Ashwin: అసలు సినిమా వదిలేసి.. ఇతరుల సినిమాలను చక్కదిద్దే పనిలో నాగ్‌ అశ్విన్‌

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

Vishnu Vardhan: బిల్లా 2 vs పంజా క్లాస్‌.. ఆ టైమ్‌లో ఏమైందో చెప్పిన డైరక్టర్‌

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ కుర్ర హీరోయిన్‌ డ్రెస్‌ రేట్‌ రూ.6 లక్షలట.. స్టార్‌ హీరో కూతురు కదా

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

ఆ వీడియోలో ఉన్నది నేను కాదు.. విజయ్‌ హీరోయిన్‌ ఆగ్రహం

trending news

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

KVN: ‘కె వి ఎన్’ భారం అంతా చిరంజీవిపైనే..?!

13 hours ago
Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

Akhil Akkineni: ఒక్కటే కథ ..గోపీచంద్ చేస్తే ప్లాప్.. అఖిల్ చేస్తే సూపర్ హిట్

16 hours ago
Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

Dil Raju: ‘ఇరుముడి’ వివాదాన్ని స్మార్ట్ గా సైడ్..కి నెట్టిన దిల్ రాజు

20 hours ago
Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

Veta: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన ‘వేట’

21 hours ago
Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

Irumudi Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ‘ఇరుముడి’

22 hours ago

latest news

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

NBK 111: ప్లాన్స్‌లో ఎలాంటి మార్పు లేదు.. చెప్పినట్లే వస్తాడట

16 hours ago
Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

Kalki 2: ‘కల్కి 2’షూటింగ్‌ అప్‌డేట్‌.. ఆ రూమర్లన్నీ ఫేక్‌.. ఏమైందంటే?

17 hours ago
NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

NBK 111: బాలయ్య పై పెద్ది భారం.. ఎంతవరకు?

1 day ago
August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

August Box Office: ఆగస్టు బాక్సాఫీస్.. 40 వస్తే… హిట్ అయినవి ఎన్నో తెలుసా?

1 day ago
Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

Sardar 2: ఎవరీ రవీంద్ర కౌశిక్‌.. ‘సర్దార్‌’ మిత్రన్‌ మాటల తర్వాత తెగ సెర్చింగ్‌!

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version