క్రేజీ విలన్ తో కూడిన ప్యూర్ విలేజ్ లవ్ స్టోరీ!

కమెడియన్ గా ఇప్పుడిపుడే ఎదుగుతున్న సుహాస్ కలర్ ఫోటో సినిమాతో హీరోగా మారాడు. ఈ మూవీ టీజర్ నేడు చిత్రం బృందం విడుదల చేశారు. కలర్ ఫోటో ప్యూర్ విలేజ్ లవ్ డ్రామా అని అర్థం అవుతుంది. అందమైన ఓ అమ్మాయిని ప్రేమించే నల్లటి అబ్బాయిగా సుహాస్ కనిపిస్తున్నారు. ఇక పల్లెటూరి అమ్మాయి పాత్రలో యంగ్ హీరోయిన్ చాందిని చౌదరి క్యూట్ అండ్ ఇన్నోసెంట్ లుక్ లో ఆకట్టుకున్నారు. సుహాస్ డైలాగ్స్, పాత్ర తీరు, తన శరీర రంగు కారణంగా ఆత్మన్యూనతా భావం ఫీలయ్యే కుర్రాడిగా కనిపిస్తున్నారు.

స్వఛ్చమైన ప్రేమ కలిగిన అమాయకుడిగా ఆయన పాత్ర తీరు కనిపిస్తుంది. ఇక ఈ విలేజ్ ప్రేమ కథలో సీరియస్ విలన్ సునీల్ అని అర్థం అవుతుంది. పోలీసు అధికారి హోదాలో ఈ ప్రేమ జంటను ముప్పతిప్పలు పెట్టే పోలీస్ విలన్ గా సునీల్ రోల్ బాగుంటుందన్న భావన కలుగుతుంది. ముఖ్యంగా సునీల్ చెప్పిన ”ప్రేమ గొప్పదా భయం గొప్పదా” డైలాగ్ బాగుంది.

హీరోయిన్ చాందిని చౌదరిపై కోరికతో వీరి ప్రేమకు అడ్డుపడే పోలీసుగా సునీల్ పాత్ర కొంచెం సీరియస్ గా ఉంటుందని టీజర్ చూస్తే అర్థం అవుతుంది. ఇక ఈ మూవీలో నవ్వించే బాధ్యత వైవా హర్ష తీసుకున్నారు. ఆయన కామెడీ టైమింగ్ ఆకట్టుకుంది. మొత్తంగా కలర్ ఫోటో టీజర్ తరువాత సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. సాయి రాజేష్ మరియు బెన్నీ ముప్పనేని నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సందీప్ రాజ్.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus