కలర్స్ స్వాతి అందరికీ సుపరిచితమే. ఒకప్పుడు యాంకర్ గా రాణించిన ఈమె తర్వాత ‘అష్టా చమ్మా’ ‘కార్తికేయ’ ‘గోల్కొండ హైస్కూల్’ వంటి హిట్ సినిమాల్లో కూడా నటించింది. తర్వాత పెళ్లి చేసుకుని సినిమాలకు దూరమైంది. అయితే కొద్దిరోజుల క్రితం.. ఈమె విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రచారం జరిగింది. అందులో ఎంతవరకు నిజముందో తెలీదు కానీ.. తిరిగి ఈమె సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చింది. ‘కార్తికేయ 2 ‘ లో గెస్ట్ రోల్ చేసిన ఈమె వెబ్ సిరీస్లలో అలాగే సాయి ధరమ్ తేజ్ తో ఓ షార్ట్ ఫిలిం, అలాగే ‘మంత్ ఆఫ్ మధు’ అనే సినిమాలో కూడా నటించింది.
అక్టోబర్ 6 న ఈ సినిమా రిలీజ్ కాబోతున్నట్లు ఈరోజు ఓ ఈవెంట్ ను ఏర్పాటు చేసి మేకర్స్ ప్రకటించారు. అలాగే ఈ వేడుకలో స్వాతి చేసిన కామెంట్స్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘చాలా ఏళ్ళ తర్వాత నేను స్టేజి మీద మాట్లాడుతున్నాను. నాకు మాటలు రావడం లేదు. ఈ మధ్య స్టేజ్ పై మాట్లాడటానికి కూడా స్క్రిప్ట్ రాయించుకుంటున్నారట. నాకు ఈ మధ్యనే తెలిసింది.’ అంటూ ఈమె (Color Swathi) చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.
నిజమే.. ఈ మధ్య చాలా మంది సెలబ్రిటీలు స్క్రిప్ట్ లు రాయించుకుంటే తప్ప స్టేజి పై ఏమీ మాట్లాడటం లేదు. ఇక స్వాతి ఈ వేడుకలో మరింతగా మాట్లాడుతూ.. ” ‘మంత్ ఆఫ్ మధు’ లో మేము నమ్మిన నిజాన్ని నిజాయితీగా చూపించాము. మనకు చిన్నప్పటి నుండి ఏదో చెప్తారు, ఏదో నమ్ముతాము. కానీ రియల్ లైఫ్ అలా ఉండదు. ఈ సినిమాలో చూపించిన నిజం..ధైర్యాన్ని ఇచ్చేలా ఉంటుంది. మా సినిమాలో ఉన్న నిజాయితీ ప్రేక్షకులకు నచ్చుతుందని నేను బలంగా నమ్ముతున్నాను.
ఈ కథని మా డైరెక్టరే రాసుకున్నారు. ఇది ఫిమేల్ సెంట్రిక్ సినిమా కాదు. అలాగే బాధ పడే సినిమా కూడా కాదు. ధైర్యం ఇచ్చే సినిమా. అక్టోబర్ 6న మా సినిమా మీ ముందుకు వస్తోంది.ఈ సినిమాకి నాకు ఇంతగా సపోర్ట్ చేసిన నవీన్ తో పాటు అందరికీ థాంక్స్ చెప్పుకుంటున్నాను. నన్ను గుర్తు పెట్టుకొని ఇంత ప్రేమ ఇస్తున్నందుకు మీ అందరికీ కూడా స్పెషల్ థాంక్స్ చెప్పుకుంటున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ‘మంత్ ఆఫ్ మధు’ చిత్రానికి శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహించారు.