ప్రముఖ టాలీవుడ్ కమెడియన్లలో ఒకరైన అలీ ప్రస్తుతం పూర్తిగా పాలిటిక్స్ పై దృష్టి పెట్టారు. వైసీపీ నుంచి ఇప్పటికే పదవి పొందిన అలీ 2024 ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించాలని భావిస్తున్నారు. పార్టీ ఆదేశిస్తే పవన్ పై పోటీ చేయడానికి కూడా సిద్ధమేనని అలీ ప్రకటించారు. అయితే రాజమండ్రి నుంచి పోటీ చేయాలని అలీ భావిస్తున్నారని తెలుస్తోంది. రాజమండ్రి అలీ సొంతూరు కావడంతో అక్కడినుంచి పోటీపై ఆయన తెగ ఆసక్తి చూపిస్తున్నారని సమాచారం.
ఎమ్మెల్యే అభ్యర్థిగా ఆయన పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని కొంతమంది అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం గమనార్హం. కమెడియన్ అలీ సినిమాల కంటే రాజకీయాలకే ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. సినిమాల ద్వారా అలీ ఊహించని రేంజ్ లో సంపాదించారు. ఎన్నో సినిమాల సక్సెస్ లో అలీ పాత్ర ఎంతో ఉంది. 2019 ఎన్నికల సమయంలో వైసీపీ తరపున అలీ ప్రచారం చేశారు.
అలీ రాబోయే రోజుల్లో పూర్తిస్థాయిలో రాజకీయాలకే పరిమితం కావాలని అనుకుంటున్నారు.
టాక్ షోలకు కూడా అలీ గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే. అలీ కొన్ని నెలల క్రితం కూతురి పెళ్లిని గ్రాండ్ గా చేశారు. అలీ తన కామెంట్ల ద్వారా కొన్ని వివాదాల్లో చిక్కుకున్నా ఇప్పుడు మాత్రం వివాదాలకు దూరంగా ఉండటానికి ఆయన ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి. అలీ సొంతంగా పలు సేవా కార్యక్రమాలను సైతం నిర్వహిస్తున్నారు.
అలీ జనసేనలో చేరి ఉంటే బాగుండేదని ఇతర పార్టీలలో ఉన్నా పవన్ తో అలీ స్నేహాన్ని కొనసాగించాలని కొంతమంది సూచిస్తున్నారు. అలీకి సోషల్ మీడియాలో కూడా అభిమానించే అభిమానుల సంఖ్య పెరుగుతోంది. సినిమాలకు సంబంధించి అలీ రెమ్యునరేషన్ రోజుకు 2 లక్షల రూపాయలకు అటూఇటుగా ఉందని తెలుస్తోంది.
రైటర్ పద్మభూషణ్ సినిమా రివ్యూ & రేటింగ్!
రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం సినిమా రివ్యూ & రేటింగ్!
మైఖేల్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో రీమిక్స్ చేసిన 20 తెలుగు పాటలు ఇవే!