నాన్న నన్ను పట్టుకొని ఏడ్చేశారు.. కమెడియన్ కూతురు వ్యాఖ్యలు!

ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్ గా దూసుకుపోయారు లక్ష్మీపతి. బాబీ, అల్లరి, మురారి, కితకితలు.. ఇలా దాదాపు నలభైకి పైగా సినిమాల్లో నటించారు. కమెడియన్ సునీల్ తో లక్ష్మీపతి కాంబినేషన్ సీన్స్ బాగా పండేవి. లక్ష్మీపతి అన్నయ్య శోభన్ ఇండస్ట్రీలో దర్శకుడిగా రాణించారు. ఆయన మహేష్ బాబుతో ‘బాబీ’, ప్రభాస్ తో ‘వర్షం’ సినిమాలు తీశారు. ఈ అన్నదమ్ములు ఇద్దరూ నెల రోజుల వ్యవధిలో మరణించడం అప్పట్లో సంచలనం రేపింది.

తాజాగా లక్ష్మీపతి కూతురు, ఆర్జే శ్వేతా లక్ష్మీపతి తన తండ్రి, బాబాయ్ ల గురించి కొన్ని కామెంట్స్ చేసింది. సినిమాలను తీసే క్రమంలో తమకున్న ఆస్తులు పోయాయని.. రెండు థియేటర్లు అమ్మేశారని.. కొన్నాళ్లు బాబాయ్ కనిపించలేదని చెప్పుకొచ్చింది. ఆ తరువాత ఒక లెటర్ వచ్చిందని.. అందులో బాబాయ్ ఒకచోట క్షేమంగా ఉన్నారని రాసి డబ్బులు కూడా పంపించారని తెలిపింది. తన పుట్టినరోజు ముందు ఒక గిఫ్ట్ పంపించారని గుర్తు చేసుకుంది.

ఆయన డైరెక్ట్ చేసిన తొలి సినిమా ‘బాబీ’ ప్లాప్ కావడంతో ఫ్యామిలీపై ఎఫెక్ట్ పడిందని.. ఆర్థికంగా కుటుంబం కష్టాలు పడిందని.. అందుకే నెక్స్ట్ సినిమా ‘వర్షం’ కసితో తీశారని వివరించింది. ‘వర్షం’ హిట్ అయినా.. ఆ తరువాత తీసిన ‘చంటి’ ఫెయిల్ అవ్వడంతో మళ్లీ కష్టాలు మొదలయ్యాయని తెలిపింది. బాబాయ్ చనిపోయినప్పుడు తను వైజాగ్ లో ఉన్నానని.. విషయం తెలిసి వెంటనే హైదరాబాద్ కి వెళ్లానని.. ఇంటికెళ్లేసరికి అందరూ ఏడుస్తున్నారని.. కానీ తను మాత్రం ఏడవలేదని.. అందరూ నిద్రపోయాక ఏడ్చానని చెప్పింది.

బాబాయ్ లేరనే బాధ తట్టుకోలేక నాన్న తాగి వచ్చారని.. ఆ కోపంతో నాన్నతో మాట్లాడలేదని.. బాబాయ్ అంత్యక్రియలు పూర్తయ్యాక తిరిగి వైజాగ్ వెళ్తుంటే.. నాన్న నన్ను పట్టుకొని ఏడ్చాడని తెలిపింది శ్వేతా. బాబాయ్ చనిపోయిన నెల రోజులకే నాన్న కూడా పోయారని ఎమోషనల్ అయింది. బాబాయ్ మరణంతో ఆయన బాగా డిప్రెషన్ లోకి వెళ్లిపోయారని.. అదే ఆయన్ను కుంగదీసిందని చెప్పుకొచ్చింది.

18 పేజెస్ సినిమా రివ్యూ& రేటింగ్!
ధమకా సినిమా రివ్యూ& రేటింగ్!

ఈ ఏడాది ఓవర్సీస్ లో 1 మిలియన్ కొట్టిన సినిమాల లిస్ట్..!
టాప్ 10లో తెలుగు ఇండస్ట్రీ నుండి ఎన్ని సినిమాలు ఉన్నాయంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus