చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోవడం ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. జూనియర్ ఎన్టీఆర్ కు భవిష్యత్తులో సైతం ఇంటర్వ్యూలలో ఇందుకు సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యే ఛాన్స్ ఉంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ సైలెన్స్ ను బ్రేక్ చేస్తే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. అయితే పృథ్వీరాజ్ జూనియర్ ఎన్టీఆర్ అనే పేరు నాకు నచ్చదని నందమూరి తారక రామారావు అని పిలిస్తే ఇష్టమని తెలిపారు.
జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్నారని ఆయన ప్రతిభకు అవార్డులు వస్తున్నాయని ఆయన అన్నారు. టీడీపీలో పెద్దలు ఉన్నారని అందువల్లే తారక్ స్పందించడం లేదని సమయం వచ్చినప్పుడు జూనియర్ ఎన్టీఆర్ స్పందిస్తాడని పృథ్వీరాజ్ అభిప్రాయం వ్యక్తం చేశారు. పవన్ పొత్తు గురించి ఇప్పటికే వివరణ ఇచ్చారని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు. టీడీపీ అహం దెబ్బ తినేలా మాట్లాడవద్దని పవన్ కోరారని ఆయన తెలిపారు.
సీఎం నినాదాలు ఇప్పుడు చేయవద్దని సమయం, సందర్భం వచ్చినప్పుడు మాట్లాడదామని పవన్ అన్నారని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు. ఏపీలో రోడ్లు సరిగ్గా లేకపోవడం వల్ల నేను చాలా ఇబ్బంది పడ్డానని పృథ్వీరాజ్ తెలిపారు. ఏపీ పథకాల అమలులో అవినీతి జరుగుతోందని పృథ్వీరాజ్ కామెంట్లు చేశారు. పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. పృథ్వీరాజ్ ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్నారు.
పృథ్వీరాజ్ మెగా హీరోల సినిమాలలో ఎక్కువగా కనిపిస్తున్నారు. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ నుంచి పృథ్వీరాజ్ పోటీ చేస్తారేమో చూడాల్సి ఉంది. పృథ్వీరాజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. సినిమాలు, రాజకీయాలలో పృథ్వీరాజ్ వేటికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారో తెలియాల్సి ఉంది. తన కామెంట్ల ద్వారా పృథ్వీరాజ్ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.
మార్క్ ఆంటోనీ సినిమా రివ్యూ & రేటింగ్!
ఛాంగురే బంగారు రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సోదర సోదరీమణులారా సినిమా రివ్యూ & రేటింగ్!