“రేప్” ఈ పదం వినడానికి జనాలు ఎందుకో పెద్దగా ఇష్టపడరు. కానీ.. న్యూస్ చానల్స్, న్యూస్ పేపర్స్, వెబ్ సైట్స్ ఇలా ఆల్మోస్ట్ అన్నీ రకాల వార్తా మాధ్యమాల్లోనూ రోజుకి కనీసం మూడు నాలుగు వార్తలు ఈ “రేప్” అనే అంశం గురించే ఉంటాయి. ఇదివరకు రేప్ అంటే అమ్మాయిలపై జరిగే ఓ రాక్షస ఖాండ.. ఇప్పుడు అది మగాళ్ల మీద కూడా జరుగుతుండడం సర్వసాధారణం అయిపోయింది. అయితే.. చాలా మంది అమ్మాయిల్లాగే, అబ్బాయిలు కూడా పరువు పోతుంది అని తాము అనుభవించిన లైంగిక వేదనను ఎవరితోనూ పంచుకోరు.
కానీ.. టాలీవుడ్ టాప్ & మోస్ట్ వాంటెడ్ కమెడియన్స్ లో ఒకరైన రాహుల్ రామకృష్ణ తన చిన్నతనంలో జరిగిన ఒక దారుణమైన సంఘటనను ట్విట్టర్ ద్వారా అందరితో పంచుకున్నాడు. “నేను చిన్నతనంలో రేప్ చేయబడ్డాను, ఇంతకు మించి నా బాధను ఎలా చెప్పుకోవాలో అర్ధం కావడం లేదు. ఈ సమాజంలో న్యాయం లేదు.. మీ ఇంట్లో మగవాళ్ళకు మంచిగా బిహేవ్ చేయడం నేర్పించండి, ఈ సొసైటీ కండీషనింగ్ నుండి బయటకు రండి, స్వేచ్ఛగా బ్రతకండి” అంటూ తన బాధను వెళ్ళగక్కాడు రాహుల్. ఇది రాహుల్ రామకృష్ణ ఒక్కడి వ్యధ మాత్రమే కాదు.. ఎందరో నోరు తెరచి చెప్పుకోలేని వారి రొద. ఆడ-మగ అనే తేడా లేకుండా జరుగుతున్న ఈ రేప్ లకు, లైంగిక దాడులకు స్వస్తి ఎప్పుడు అనే ప్రశ్నకు సమాధానం ప్రభుత్వాల దగ్గర నుండో, సమాజం నుండో రాదు.. మనలో నుండి రావాలి, మన భవిష్యత్ తరాలకు సెక్స్ ఎడ్యుకేషన్ అవసరం, సెక్స్ అంటే కోరిక కాదు జీవితంలో ఒక శారీరిక అవసరం మాత్రమే అని తెలుసుకొనే విజ్ణత రావాలి. అది రానంతవరకూ ప్రపంచం గతి మారదు, మనిషి ఎదగడు.