బోయపాటి ఈసారైనా కామెడీ పండించగలాడా ??

హీరోగా ప్రయత్నించి మొదట్లో పర్వాలేదు అనిపించుకున్నా.. తర్వాత చేతులు కాల్చుకుని ప్రస్తుతం కమెడియన్ గా పూర్వ వైభవం సంపాదించడం కోసం నానా కష్టాలు పడుతున్న సునీల్ కు కమెడియన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ఆశించిన స్థాయి గుర్తింపు మాత్రం తెచ్చిపెట్టలేదు. అయితే.. సునీల్ కు పూర్తిస్థాయి కమెడియన్ లేదా సపోర్టింగ్ రోల్ కూడా ఈ సెకండ్ ఇన్నింగ్స్ లో దొరకలేదు. ఆ లోటు తీర్చేందుకు సన్నద్ధమవుతున్నాడు బోయపాటి శ్రీను.

బోయపాటి-బాలయ్య కాంబినేషన్లో ఓ పవర్ ఫుల్ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం బాలయ్య గుండు గెటప్ ఆల్రెడీ వైరల్ అయ్యింది. ఈ సినిమాలో సునీల్ ఓ పూర్తిస్థాయి పాత్ర పోషించేందుకు రెడీ అవుతున్నాడు. ఈ సినిమాలో బాలయ్య స్నేహితుడి పాత్రలో సునీల్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమాలో హీరోయిన్ ను ఫైనల్ చేసే పనిలో ఉన్న బోయపాటి.. హీరోయిన్స్ ఫిక్స్ అవ్వగానే సినిమాను సెట్స్ కు తీసుకువెళ్ళేందుకు ప్లాన్ చేస్తున్నారు. మరి బాలయ్య-సునీల్ కాంబో ఏమేరకు ఆకట్టుకుంటుందో చూద్దాం.

డిస్కో రాజా సినిమా రివ్యూ & రేటింగ్!
సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus