వైరల్ అవుతున్న కమెడియన్ వివేక్ కూతురి పెళ్లి ఫోటోలు.!

దివంగత స్టార్ కమెడియన్ వివేక్ (Vivek) అందరికీ గుర్తుండే ఉంటాడు. తమిళ సినిమాల్లో ఎక్కువగా నటించినప్పటికీ తెలుగు ప్రేక్షకులకు కూడా ఇతను ఇష్టమైన కమెడియన్ అని చెప్పొచ్చు. ‘అపరిచితుడు’ ‘శివాజీ’ (Sivaji) ‘రఘువరన్ బి.టెక్’ (Raghuvaran Btech) వంటి సినిమాలతో ఇతను తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు. మీమ్స్ ద్వారా కూడా ఇతను ఎక్కువగా కనిపిస్తూనే ఉంటాడు. 2021లో గుండెపోటుతో ఇతను హఠాన్మరణం చెందాడు. కోవిడ్ సోకడం వల్ల ఇతను చనిపోయినట్లు అప్పట్లో పెద్ద చర్చ జరిగింది.

ఏదేమైనా తక్కువ వయసులోనే ఇతను మరణించడం ఆ టైంలో అందరినీ విషాదంలోకి నెట్టేసినట్లు అయ్యింది. ఇదిలా ఉండగా.. 3 ఏళ్ళ తర్వాత వివేక్ ఇంట్లో ఓ శుభకార్యం జరిగింది.ఇది నిజంగా విశేషం అనే చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. వివేక్ కూతురు తేజస్వినికి భరత్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. మార్చి 28న ఈమె వివాహం జరిగినట్లు తెలుస్తుంది. చెన్నైలోని విరుగంబాక్కం పద్మావతి నగర్ లోని చిన కలైవారన్ రోడ్ లో గల వివేక్ నివాసం వద్ద జరిగినట్లు సమాచారం.

వీరి పెళ్లి వేడుక తక్కువ మంది బంధుమిత్రులు, స్నేహితుల సమక్షంలో జరిగినట్లు తెలుస్తుంది. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాస్త ఆలస్యంగా బయటకు వచ్చినప్పటికీ ఆ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి. సినీ పరిశ్రమకు చెందిన వాళ్ళు ఎక్కువమంది ఈ వేడుకకు హాజరు కాలేదు లేదు అని స్పష్టమవుతుంది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus