స్టార్ హీరో మీద వ్యంగ్య వ్యాఖ్యలు!

టాలీవుడ్ యువ స్టార్ హీరోలకు ఏ మాత్రం తగ్గని క్రేజ్ తమిళనాడులో విజయ్ కు ఉంది. అతగాడికి యూత్ ఫాలోయింగ్ కాస్త ఎక్కువే. అలాంటి అతగాడు పొరపాటుగా మాట్లాడిన ఒక మాట సోషల్ మీడియాలో జోకుల మీద జోకులు పేలుతున్నాయి. అతగాడి మీద ఎటకారం ఓ రేంజ్లో చేస్తూ.. వ్యంగ్య వ్యాఖ్యలు జోరుగా చేస్తున్నారు. ఇంతకీ అంతలా అతను బుక్ చేసిన విషయం ఏమిటంటే.. నవ చైనాకు ఆదర్శప్రాయుడు అయిన మావో జెడాంగ్ గురించి మాట్లాడుతూ.. మావోను రష్యా నేతగా చెప్పాడు. అంతే.. అతని మీద జోకుల మీద జోకులు పేలుతున్నాయి. తన తాజా చిత్రం తేరీ ఆడియో ఆవిష్కరణ సందర్భంగా మావో గురించి మాటలు చెప్పిన విజయ్.. పొరపాటున మావోను చైనా నేతగా కాకుండా రష్యా నేతగా చెప్పాడు. దీనిపై సోషల్ మీడియాలో పలు కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus