సినిమాల్లో కథను చెప్పడానికి రెండున్నర గంటల సమయం ఉంటుంది. అదే వాణిజ్య ప్రకటనల్లో అయితే కొన్ని సెకన్లు మాత్రమే ఉంటుంది. అతి తక్కువ టైమ్ లోనే అనుకున్న విషయాన్నీ చెప్పగలగాలి.. అందరికీ అర్ధమవ్వాలి. అందుకే చాలామంది మూవీ కంటే యాడ్స్ తీయడం కష్టం అంటుంటారు. అటువంటి యాడ్స్ మేకింగ్ లోను మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కింగ్ అనిపించుకున్నారు. స్టార్ హీరోలతో ఆయన రూపొందించిన ప్రకటనలు బాగా పాపులర్ అయ్యాయి. వాటిపై ఫోకస్..
జోరున్న పెప్సీ
భారత క్రికెట్ టీమ్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో సాఫ్ట్ డ్రింక్ పెప్సీ కోసం త్రివిక్రమ్ డైరక్ట్ చేసిన యాడ్ యువతలోని జోరుని ప్రతిబింభించింది.
వెలిగి పోయింది
బంగారు ఆభరణాల స్టోర్ కి హీరోయిన్స్ తో ప్రకటన రూపొందిస్తారు. కానీ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఒక రింగ్ కూడా చూపించకుండా .. “నేను సినిమాను బడ్జెట్ చూసి సెలక్ట్ చేస్తానా అని అందరూ అడుగుతుంటారు .. మ్ఉహు.. స్క్రిప్ట్ చూసి చేస్తాను. స్క్రిప్ట్ జెన్యూన్ గా ఉంటే ఏ సినిమా అయినా వెలిగి పోతుంది” అంటూ ఒక డైలాగుతో “జొస్ అలుక్కాస్” యాడ్ రూపొందించి త్రివిక్రమ్ పెన్ పవర్ చూపించారు.
లవ్ స్టోరీ
సెల్ కాన్ మొబైల్ ప్రకటనలో విరాట్ కోహ్లీ, తమన్నాలతో మాటల మాంత్రికుడు ఏకంగా లవ్ స్టోరీనే చూపించారు.
పిల్లలపై ప్రేమ
పిల్లలకు చక్కని వైద్యం అందించడంలో రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ ఎల్లప్పుడూ ముందు ఉంటుందని చాలా సింపుల్ గా మహేష్ బాబు తో చెప్పించారు.
కూల్ కూల్
యాక్షన్ హీరో ఎన్టీఆర్ తో నవరత్న హెయిర్ ఆయిల్ యాడ్ ని చాలా కూల్ కూల్ గా తీశారు.
స్మార్ట్ వర్క్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో త్రివిక్రమ్ షూట్ చేసిన మరో యాడ్ “ఎయిర్ టెల్”. ఇందులో కలర్స్ స్వాతి కూడా నటించింది. దీనిని చాలా స్మార్ట్ గా రూపొందించారు.
బ్యూటీఫుల్
సూపర్ స్టార్ మహేష్ బాబు తేజస్సుని జోడించి సంతూర్ సోప్ ప్రకటనను త్రివిక్రమ్ చాలా అందంగా చిత్రీకరించారు.
సూపర్ స్టార్
“పోటీ అనగానే ఎవడైతే స్ట్రాంగ్ గా నిలబడతాడో వాడే సూపర్ స్టార్ “.. ఈ డైలాగ్ వినగానే మనకి త్రివిక్రమ్ గుర్తుకొస్తారు. మహీంద్రా ట్రాక్టర్స్ యాడ్ ని కూడా మాటల మాంత్రికుడే తెరకెక్కించారు.
గేర్ మార్చిన యాడ్
బైక్ యాడ్ లకు భిన్నంగా టీవీఎస్ ఫోనిక్స్ బైక్ యాడ్ ని డిజైన్ చేసి త్రివిక్రమ్ తన క్రియేటివిటీని చూపించారు.
హ్యాపీ జర్నీ
త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో తాజాగా వచ్చిన ఆన్ లైన్ బస్ టికెట్ పోర్టల్ అభి బస్ యాడ్ అందరినీ ఆకట్టుకుంటోంది.