ఆర్.ఆర్.ఆర్ టు లైగర్… 2022 లో విడుదల కాబోతున్న క్రేజీ మూవీస్ లిస్ట్..!

2020 కంటే 2021 కాస్త బెటరే అనే ఫీలింగ్ టాలీవుడ్ కు కలిగింది. కరోనా ఓ పక్క దాడి చేస్తున్నప్పటికీ…దాన్ని లెక్క చేయకుండా సినీ ప్రేమికులు థియేటర్లకు బాగానే వచ్చారు. ఈ ఏడాది మొత్తం 3 పెద్ద సినిమాలు విడుదల అయ్యాయి. అవే ‘వకీల్ సాబ్’ ‘అఖండ’ ‘పుష్ప’. అలాగే ‘క్రాక్’ ‘శ్యామ్ సింగ రాయ్’ ‘లవ్ స్టోరీ’ ‘ఉప్పెన’ వంటి మిడ్ రేంజ్ సినిమాలు కూడా విడుదలై సూపర్ హిట్లు అయ్యాయి. ‘జాతి రత్నాలు’ వంటి చిన్న సినిమా కూడా ఎవ్వరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ కొట్టింది.

మొత్తానికి పరభాషా సినీ పరిశ్రమల కంటే మన టాలీవుడ్ ప్రాగ్రెస్ బాగుంది. అయితే చాలా మంది స్టార్ హీరోల సినిమాలు ఈ ఏడాది రాలేదు. 2020, 2021 లో థియేటర్లలో సందడి చేసిన హీరో ఒక్క అల్లు అర్జున్ మాత్రమే. చిరంజీవి,రాంచరణ్, ఎన్టీఆర్, ప్రభాస్, మహేష్ బాబు వంటి హీరోల సినిమాలు ఈ ఏడాది విడుదల కాకపోవడం వాళ్ళ అభిమానుల్ని నిరాశపరిచింది.

అయితే ఆ హీరోల టార్గెట్ 2022 పైనే ఉంది. వీళ్ళు మాత్రమే కాదు 2021 లో ఆబ్సెంట్ అయిన హీరోలంతా 2022 లో బ్లాక్ బస్టర్లు కొట్టాలని ముందుగానే రిలీజ్ డేట్లు కన్ఫర్మ్ చేసుకున్నారు. 2022 సంక్రాంతి దగ్గర్నుండీ బాక్సాఫీస్ కు పూర్వ వైభవాన్ని తెప్పించేందుకు చాలా పెద్ద సినిమాలు రెడీగా ఉన్నాయి. మరి ఆలస్యం చేయకుండా 2022 లో విడుదల తేదీలని కన్ఫర్మ్ చేసుకున్న పెద్ద సినిమాలు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

1) ఆర్.ఆర్.ఆర్ :

టాలీవుడ్ కు మాత్రమే కాదు యావత్ సినీ పరిశ్రమకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు రాజమౌళి… చరణ్, ఎన్టీఆర్ లతో రూపొందించిన ‘ఆర్.ఆర్.ఆర్’ చిత్రం జనవరి 7న విడుదల కాబోతుంది.

2) రాధే శ్యామ్ :

ప్రభాస్ హీరోగా రాధా కృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందిన ‘రాధే శ్యామ్’ చిత్రం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కాబోతుంది.

3) బంగార్రాజు :

‘సోగ్గాడే చిన్నినాయన’ చిత్రంతో 2016 సంక్రాంతికి బాక్సాఫీస్ ను షేక్ చేసిన నాగార్జున.. ఆ చిత్రం సీక్వెల్ అయిన ‘బంగార్రాజు’ తో జనవరి 15న ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

4) ఆచార్య :

మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

5) మేజర్ :

అడివి శేష్ హీరోగా మహేష్ బాబు నిర్మాణంలో రూపొందుతోన్న ‘మేజర్’ చిత్రం ఫిబ్రవరి 18న విడుదల కాబోతుంది.

6) భీమ్లా నాయక్ :

పవన్ కళ్యాణ్- రానా కాంబినేషన్లో రూపొందుతోన్న ‘భీమ్లా నాయక్’ చిత్రం ఫిబ్రవరి 25న విడుదల కాబోతుంది.

7) పక్కా కమర్షియల్ :

గోపీచంద్- మారుతీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రం మార్చి 18న విడుదల కాబోతుందని మేకర్స్ ప్రకటించారు.

8) రామారావ్ ఆన్ డ్యూటీ :

రవితేజ హీరోగా శరత్ మండవ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం మార్చి 25న విడుదల కాబోతుంది.

9) సర్కారు వారి పాట :

మహేష్ బాబు హీరోగా పరశురామ్(బుజ్జి) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘సర్కారు వారి పాట’ చిత్రం ఏప్రిల్ 1న విడుదల కాబోతుంది.

10)కె.జి.ఎఫ్ చాప్టర్ 2 :

కన్నడ స్టార్ హీరో యష్… ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కె.జి.ఎఫ్ చాప్టర్ 2’ చిత్రం ఏప్రిల్ 14న విడుదల కాబోతుంది.

11) హరి హర వీర మల్లు :

పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్లో రూపొందుతోన్న ఈ పాన్ ఇండియా చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.

12) ఎఫ్3 :

వెంకటేష్- వరుణ్ తేజ్ లు హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఎఫ్3’ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కాబోతుంది.

13) గాడ్ ఫాథర్ :

చిరంజీవి నటిస్తున్న ‘లూసీఫర్’ రీమేక్… ‘గాడ్ ఫాథర్’ చిత్రం ఏప్రిల్ 30న విడుదల కాబోతున్నట్టు ప్రకటించారు.

14) ఖిలాడి :

రవితేజ హీరోగా రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ఖిలాడి’ చిత్రం మే 30న విడుదల కాబోతుంది.

15) ఆది పురుష్ :

ప్రభాస్ హీరోగా రూపొందుతోన్న ‘ఆది పురుష్’ చిత్రం ఆగష్ట్ 11న విడుదల కాబోతుంది.

16)లైగర్ :

విజయ్ దేవరకొండ- పూరి జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న ‘లైగర్’ చిత్రం ఆగష్ట్ 25న.. ‘అర్జున్ రెడ్డి’ రిలీజ్ అయిన తేదీన విడుదల కాబోతుంది.

ఇవి ఇప్పటివరకు ఆయా చిత్రాల మేకర్స్ ప్రకటించిన విడుదల తేదీలు. వీళ్ళు ప్రకటించిన తేదీలకి ఈ సినిమాలు వస్తాయా అంటే? కచ్చితంగా అవునని చెప్పలేం కానీ 2022 లోనే ఇవి విడుదలయ్యే అవకాశం అయితే ఉంది.

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus