BIgg Boss 5 Telugu: TRP కోసం బిగ్ బాస్ మాములు స్కెచ్ మాములుగా లేదుగా..!

బిగ్ బాస్ హౌస్ లో అనీమాస్టర్ ఎలిమినేట్ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇక ఈవారం బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్స్ ఫ్యామిలి మెంబర్స్ రాబోతున్నారు. గత నాలుగు సీజన్స్ గా ఈ టాస్క్ ని మనం చూస్తునే ఉన్నాం. ఇప్పుడు ఈసీజన్ లో కూడా హౌస్ మేట్స్ ని లోపలకి పంపిస్తూ టీఆర్పీ కోసం బిగ్ బాస్ టీమ్ సూపర్ స్కెచ్ గీసినట్లుగా తెలుస్తోంది. గత సీజన్ లో గ్లాస్ డోర్ నుంచే హౌస్ మేట్స్ ని వాళ్ల కుటుంబసభ్యులు పలకరించారు. అయితే, ఈసారి మాత్రం డైరెక్ట్ గా లోపలకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందుకోసం నాలుగైదు రోజులపాటు వారిని క్వారైంటైన్ లో ఉంచారు.

అయితే, అనీమాస్టర్ ఎలిమినేషన్ ని ముందుగానే ఊహించిన బిగ్ బాస్ టీమ్ అనీమాస్టర్ కుటుంబ సభ్యులని క్వారంటైన్ లో ఉంచలేదు. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో కేవలం ఎనిమిది మంది పార్టిసిపెంట్స్ మాత్రమే ఉన్నారు. వీళ్లలో టాప్ 5కి వచ్చేది ఎవరు అనేది చాలా ఆసక్తికరంగా మారింది. అంతేకాదు, కొంతమంది ఫ్యామిలీ మెంబర్స్ స్టేజ్ పైన వీకెండ్ నాగార్జునతో కలిసి టాప్ 5 గేమ్ ఆడతారని కూడా టాక్ వినిపిస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ కుటుంబ సభ్యులని హౌస్ లోకి పంపించేందుకు కూడా సన్నాహాలు స్టార్ట్ అయ్యాయి.

సన్నీ మదర్, రవి వైఫ్ నిత్యా ఇంకా వాళ్ల పాప, అలాగే శ్రీరామ్ చంద్ర మదర్ వచ్చే అవకాశం ఉంది. ఇక కాజల్ హస్బెండ్ అండ్ సన్ , పింకీ ఫాదర్ కూడా రాబోతున్నారు. ముఖ్యంగా పింకీ ఫాదర్ ఎపిసోడ్ లో హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తోంది. దీనివల్ల టీఆర్పీ రేటింగ్ అద్దిరిపోవాలని చూస్తున్నారు. మరోవైపు షణ్ముక్ దీప్తిలని కూడా ఇక్కడ హైలెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే సిరి బాబు, బాయ్ ఫ్రెండ్స్ కూడా రాబోతున్నారు. ఇక మానస్ వాళ్ల మదర్ ని కూడా హైలెట్ చేయబోతున్నారట. ఇలా కుటుంబ సభ్యుల ఎపిసోడ్ హైఎస్ట్ టీఆర్పీ వచ్చేలాగా ప్లాన్ చేస్తున్నారు. ఈటాస్క్ హౌస్ లో ఎమోషన్స్ ని పండించడం ఖాయమని, రెండు రోజులు టెలికాస్ట్ అవుతుందని చెప్తున్నారు. అదీ మేటర్.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus