Bigg Boss 7 Telugu: సేఫ్ గేమ్ ఆడిన పార్టిసిపెంట్స్..! ట్రోల్ చేస్తున్న ఆడియన్స్..!

బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం 9వ వారం నామినేషన్స్ నడుస్తున్నాయి. ప్రతి వారం లాగానే ఈసారి కూడా రెండు రోజులు ఈ నామినేషన్స్ ఉన్నాయి. దీంతో ఆడియన్స్ కి చిరాకు వచ్చేస్తోంది. ఎందుకంటే, ఈసీజన్ లో ఇది వరుసగా రెండు రోజులు నామినేషన్స్. మరోపక్క లైవ్ లో అన్ని నామినేషన్స్ పూర్తి అయిపోయాయి. అంతేకాదు, 9వ వారం కెప్టెన్సీ టాస్క్ కూడా ప్రారంభం అయిపోయింది. ఈ నేపథ్యంలో ఈవారం కూడా లేట్ అవుతోందని ఆడియన్స్ మొత్తుకుంటున్నారు. ఈవిషయం పక్కనబెడితే, 9వ వారం నామినేషన్స్ లో భోలే తన పాటలతో రచ్చ లేపాడు.

ప్రియాంకని ఇంకా అమర్ ని నామినేట్ చేసిన భోలే ఇద్దరికీ ఒక పాట పాడాడు. గెలుపు వెనకాలే ఓటమి ఉంటుంది. ఈ ఓటమి గెలుపుకి బాటలు వేస్తుందంటూ అమర్ కి బుద్ధులు చెప్పాడు. కానీ, అమర్ ఫుల్ గా భోలే పై రెచ్చిపోయాడు. మీ పాయింట్ ఏంటో చెప్పమని అన్నాడు. దానికి భోలే లాస్ట్ వీక్ నామినేషన్స్ అప్పుడు నామీద కోపం కూర్చీని బలంగా తన్ని పగిలిపోద్ది అంటూ మాట్లాడావ్ అని అందుకే ఇప్పుడు నామినేట్ చేస్తున్నానని, అంతేకాదు, గతవారం కూడా నన్ను అకారణంగా నామినేట్ చేశావ్ అంటూ తనదైన స్టైల్లో నామినేట్ చేశాడు.

అలాగే, ప్రియాంకని కూడా కెప్టెన్సీ టాస్క్ లో నిన్ను ఎందుకు తీసేశానో నీకు అర్ధం కావట్లేదని వివరణ ఇస్తూ నామినేట్ చేశాడు. అలాగే, శోభకి కూడా బుద్దులు చెప్పాడు. దీంతో ఈవారం నామినేషన్స్ లో హైలెట్ అయ్యాడు. ఇక మిగతా ఇంటి సభ్యులు అందరూ కూడా సేఫ్ గా నామినేట్ చేశారు. ముఖ్యంగా రతిక తన గేమ్ ని పక్కదోవ పట్టించుకునేలా చేసుకుంది. అలాగే, పల్లవి ప్రశాంత్ కూడా తనని కెప్టెన్సీ నుంచీ తీసేసారనే పాయింట్ పైన సేఫ్ గా నామినేట్ చేసేసుకున్నాడు. బిగ్ బాస్ హౌస్ లో ఈవారం శివాజీ నుంచీ తేజ దాకా, అశ్విని నుంచీ యావర్ దాక అందరూ కూడా సేఫ్ నామినేషన్స్ వేసుకున్నారు.

దీంతో నామినేషన్స్ లో పస లేకుండా పోయింది. నామినేషన్స్ కోసమే వైయిట్ చేసే ఆడియన్స్ కి డిస్సపాయింట్ మిగిలింది. ప్రతి వారం ఇలా రెండు రోజులు టెలికాస్ట్ చేయడం, ఓటింగ్ పోల్స్ అన్నీ కూడా ఓపెన్ అవ్వకపోవడం, అలాగే పసలేని పాయింట్స్ ని తీస్కుని వాదించడంతో ట్రోల్స్ ఎక్కువైపోయాయి. అందుకే, నామినేషన్స్ పై ట్రోలింగ్స్ ఈ సీజన్ లో ఎక్కువగా సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. ఇక ఈవారం ఈసారి మొత్తం ఎనిమిది మంది నామినేషన్స్ లో ఉన్న సంగతి తెలిసిందే. అదీ మేటర్.

‘పుష్ప’ టు ‘దేవర’.. 2 పార్టులుగా రాబోతున్న 10 సినిమాలు..!

‘సైందవ్’ తో పాటు టాలీవుడ్లో వచ్చిన ఫాదర్-డాటర్ సెంటిమెంట్ మూవీస్ లిస్ట్..!
ఆ హీరోయిన్స్ చేతిలో ఒక సినిమా కూడా లేదంట..!

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus